కేంద్రం కోర్టులోకి ఏబీవీ కేసు

|

Feb 13, 2020 | 5:09 PM

ఏపీలో అవినీతి ఆరోపణలతో సస్పెండయిన ఐబీ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు ఇష్యూ కేంద్రం ముందుకు వెళ్ళింది. రాష్ట్ర ప్రభుత్వం తనను సస్పెండ్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరుతూ ఏబీ వెంకటేశ్వర రావు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ని ఆదేశించారు. తనను ఇటీవల సస్పెండ్ చేసినప్పటికీ.. గత మే 31 నుంచి తనకు వేతనం చెల్లించడం లేదని వెంకటేశ్వరరావు క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రైబ్యునల్)కు ఫిర్యాదు చేశారు. నిరాధారమైన ఆరోపణలతో సస్పెండ్ చేయడం […]

కేంద్రం కోర్టులోకి ఏబీవీ కేసు
Follow us on

ఏపీలో అవినీతి ఆరోపణలతో సస్పెండయిన ఐబీ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు ఇష్యూ కేంద్రం ముందుకు వెళ్ళింది. రాష్ట్ర ప్రభుత్వం తనను సస్పెండ్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరుతూ ఏబీ వెంకటేశ్వర రావు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ని ఆదేశించారు.

తనను ఇటీవల సస్పెండ్ చేసినప్పటికీ.. గత మే 31 నుంచి తనకు వేతనం చెల్లించడం లేదని వెంకటేశ్వరరావు క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రైబ్యునల్)కు ఫిర్యాదు చేశారు. నిరాధారమైన ఆరోపణలతో సస్పెండ్ చేయడం చట్టవిరుద్ధమని ఏబీ వెంకటేశ్వరరావు వాదిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను కొట్టివేయాలని ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌ను కోరారు.

అయితే.. చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వున్న ఏబీ వెంకటేశ్వరరావు నిఘావిభాగం కోసం సాంకేతిక పనిముట్ల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారని, కొనుగోళ్ళలో తన తనయుని ఫర్మ్‌కు ప్రయోజనం కలిగేలా వ్యవహరించారని ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అప్పట్లో డీజీపీ స్థాయి అధికారులు వద్దని వారించినా వినకుండా ఏబీ వెంకటేశ్వరరావు తన సంబంధీకులకు ప్రయోజనం కలిగించారన్నది ప్రస్తుతం ఆయన ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోపణ.

ఈ ఆరోపణలతో ఏబీ వెంకటేశ్వరరావును గత వారం జగన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయనపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించింది. అయితే తనపై మోపిన అభియోగాలలో వాస్తవం లేదని ఏబీ వెంకటేశ్వరరావు వాదిస్తున్నారు. తాజాగా ఆయన క్యాట్‌ని ఆశ్రయించడంతో ఏబీవీ కేసు కేంద్రం కోర్టులోకి వెళ్ళినట్లయింది. ఏబీ పిటిషన్ మీద వాదనలు వినిపించేందుకు ప్రత్యేక న్యాయవాదిని నియమించారు. ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించేందుకు అడ్వకేట్ ప్రకాష్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.