Bigg Boss Telugu 4 : మనసులోని భావాలను బయటపెట్టిన అభిజిత్..ఈ విషయం అస్సలు ఊహించి ఉండరు

|

Dec 12, 2020 | 10:38 PM

బిగ్ బాస్ షోలో చివరికి వచ్చేసరికి రసవత్తరంగా మారింది. ఈ సమయంలో కూడా ఇంట్లో ఉన్నవారి మధ్య చిచ్చుపెట్టే టాస్కులే పెడుతున్నారు నిర్వాహకులు. తాజాగా కంటెస్టెంట్లు అందరూ ఇంటి సభ్యులందరిపై తొలి అభిప్రాయం..

Bigg Boss Telugu 4 : మనసులోని భావాలను బయటపెట్టిన అభిజిత్..ఈ విషయం అస్సలు ఊహించి ఉండరు
Follow us on

బిగ్ బాస్ షోలో చివరికి వచ్చేసరికి రసవత్తరంగా మారింది. ఈ సమయంలో కూడా ఇంట్లో ఉన్నవారి మధ్య చిచ్చుపెట్టే టాస్కులే పెడుతున్నారు నిర్వాహకులు. తాజాగా కంటెస్టెంట్లు అందరూ ఇంటి సభ్యులందరిపై తొలి అభిప్రాయం..చివరి అభిప్రాయం చెప్పాలని చెప్పాలని టాస్క్ ఇచ్చారు. ఈ క్రమంలో మళ్లీ మొదటి నుంచి ఇప్పటి వరకు జరిగిన విభేదాలను మరోసారి పైకిలాగే ప్రయత్నం కనిపించింది. అలా అభిజిత్ తన మనసులోని మాటలు చెప్పుకొచ్చాడు.

అభిజిత్‌కి హారిక,  అరియానాలు, సోహెల్ నచ్చారు. అఖిల్, మోనాల్‌లు నచ్చలేదు. అయితే అరియానా, సోహెల్, హారికలపై ఫస్ట్, లాస్ట్ ఇంప్రెషన్ గురించి మంచిగానే చెప్పుకొచ్చాడు. ఇక్కడి వరకు అంతా ఓకే. మోనాల్ మీద కలిగిన ఫస్ట్ ఇంప్రెషన్ గురించి వివరించాడు. మోనాల్ మొదట బాగా హైపర్ అనిపించింది. మధ్యలో ఇద్దరికి బాగానే రిలేషన్ కుదిరింది. కానీ చివరకు ఆమె, తాను, రెండు డిఫరెంట్ మెండ్‌సెట్స్ కలిగిన వాళ్లమని అర్థమైనట్లు చెప్పుకొచ్చాడు. అఖిల్‌ను ఫస్ట్ టైమ్ చూసినప్పుడు మంచి వాడు.. కూల్ ఫెల్లో అనుకున్నాను. ఇప్పుడు కూడా అంతే. అయితే మోనాల్ అనే చాప్టర్‌ను తీసేస్తే అఖిల్ తనకు చాలా మంచి స్నేహితుడు అని చెప్పుకొచ్చాడు. ఆ ఒక్క టాపిక్ వల్ల అఖిల్, తాను దూరమయ్యామంటూ వివరించాడు.

Also Read :

ఆందోళన చేస్తోన్న అన్నదాతల కోసం మొన్న పెద్ద రోటీ యంత్రాలు..ఇప్పుడు ఫుట్ మసాజర్లు, తాత్కాలిక జిమ్‌లు

Bigg Boss 4 Telugu : బిగ్ బాస్ ఫినాలేకు అతిథి మహేశ్ కాదట..’మాస్ కా బాప్’ రాబోతున్నారట !

నెల్లూరు జిల్లా వెలుగొట్లపల్లిలో పొలంలో నాట్లు వేస్తున్న ఆరుగురు కూలీలకు అస్వస్థత..ఒకరు మృతి

మహిళకు పురిటి నొప్పులు, అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేదు : వాలంటీర్లు హీరోలు అయిన వేళ