AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా లైఫ్‌లో చూసిన అత్యుత్తమ బ్యాటర్ అతనే! ఏబీ డివిలియర్స్ షాకింగ్ స్టేట్మెంట్

ఏబీ డివిలియర్స్ తన దృష్టిలో ప్రపంచపు అత్యుత్తమ టాప్ 3 బ్యాటర్లను వెల్లడించారు. విరాట్ కోహ్లీని తాను చూసిన అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా పేర్కొన్నారు. ఒత్తిడితో కూడిన రన్‌ ఛేజ్‌లలో కోహ్లీ సంయమనం, ఇన్నింగ్స్‌ను నియంత్రించే సామర్థ్యం అసాధారణమని కొనియాడారు. రికీ పాంటింగ్, కుమార సంగక్కర ఇతర దిగ్గజాలుగా పేర్కొనబడ్డారు.

నా లైఫ్‌లో చూసిన అత్యుత్తమ బ్యాటర్ అతనే! ఏబీ డివిలియర్స్ షాకింగ్ స్టేట్మెంట్
Ab De Villiers Picks His To
SN Pasha
|

Updated on: Jun 26, 2026 | 4:55 PM

Share

సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. తన దృష్టిలో ప్రపంచపు అత్యుత్తమ టాప్ 3 బ్యాటర్లు ఎవరో వెల్లడించాడు. పైగా అందులో నంబర్ వన్ ప్లేస్‌లో మన టీమిండియా దిగ్గజ క్రికెటర్ ఉండటం విశేషం. ఇంతకీ డివిలియర్స్ ఎవర్ని అత్యుత్తమ బ్యాటర్లుగా పేర్కొన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.. భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ తన జీవితంలో చూసిన అత్యుత్తమ బ్యాటర్ అని ఏబీ డివిలియన్స్ అన్నాడు. ముఖ్యంగా ఒత్తిడితో కూడిన రన్‌ ఛేజ్‌లలో కోహ్లీ ప్రదర్శించే సంయమనం, టార్గెట్‌ని చేరుకునే స్కిల్, ఇన్నింగ్స్‌ను నియంత్రించే సామర్థ్యం అసాధారణమని కొనియాడాడు.

ఒక ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మాట్లాడుతూ.. “నా జీవితంలో నేను చూసిన అత్యుత్తమ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ. అతని తర్వాతే రికీ పాంటింగ్, కుమార సంగక్కర వంటి దిగ్గజాలు వస్తారు” అని డివిలియర్స్ పేర్కొన్నాడు. కోహ్లీ ఆటలో కనిపించే నిలకడ, ఫిట్‌నెస్, మానసిక దృఢత్వం అతడిని ప్రత్యేక ఆటగాడిగా నిలబెట్టాయని చెప్పాడు. వన్డే క్రికెట్‌లో ఛేజింగ్ విషయానికి వస్తే కోహ్లీకి సాటే లేడని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. భారీ లక్ష్యాలను ఛేదించే సమయంలోనూ ఒత్తిడిని అధిగమించి జట్టును విజయతీరాలకు చేర్చే సామర్థ్యం కోహ్లీని ప్రపంచంలోనే అత్యుత్తమ ఛేజ్ మాస్టర్‌గా నిలబెట్టిందని పేర్కొన్నాడు. అందుకే తాను చూసిన అత్యుత్తమ ఆటగాడిగా కోహ్లీని ఎంచుకుంటానని స్పష్టం చేశాడు.

టీ20 క్రికెట్‌లోనూ కోహ్లీపై డివిలియర్స్ ప్రశంసలు తగ్గలేదు. ఆధునిక టీ20లో పవర్ హిట్టర్ల హవా కొనసాగుతున్నప్పటికీ, పరిస్థితులకు అనుగుణంగా ఇన్నింగ్స్‌ను నిర్మించడం, చివరి వరకు నిలబడి మ్యాచ్‌ను ముగించడం, అద్భుతమైన నిలకడను కొనసాగించడం వంటి లక్షణాల్లో కోహ్లీ నంబర్‌వన్ అని ఆయన పేర్కొన్నాడు. “నేను చూసిన వారిలో అతనే నంబర్ 1 బ్యాట్స్‌మన్” అంటూ మరోసారి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున ఎన్నో సంవత్సరాలు కలిసి ఆడిన కోహ్లీ, డివిలియర్స్ మధ్య మైదానంలోనే కాకుండా మైదానం వెలుపల కూడా మంచి స్నేహం ఏర్పడింది. ఇద్దరూ కలిసి ఎన్నో చిరస్మరణీయ భాగస్వామ్యాలు నమోదు చేసి జట్టుకు ఎన్నో విజయాలు అందించారు. పరస్పరం ఒకరిపై ఒకరు ఎన్నో సందర్భాల్లో ప్రశంసలు కురిపించారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నా లైఫ్‌లో నేను చూసి బెస్ట్ బ్యాటర్ అతనే: ABD
నా లైఫ్‌లో నేను చూసి బెస్ట్ బ్యాటర్ అతనే: ABD
భారతదేశంలోనే అత్యంత ప్రమాదకర జైలు,బ్రిటిష్ క్రూరత్వానికి నిదర్శనం
భారతదేశంలోనే అత్యంత ప్రమాదకర జైలు,బ్రిటిష్ క్రూరత్వానికి నిదర్శనం
శవాల దిబ్బగా మారిన వెనిజులాకు భారత్ స్నేహ హస్తం!
శవాల దిబ్బగా మారిన వెనిజులాకు భారత్ స్నేహ హస్తం!
జూలై నెలలో ఈ రాశుల వారికి డబ్బే డబ్బు.. మీ రాశి ఉందేమో చూసుకోండి!
జూలై నెలలో ఈ రాశుల వారికి డబ్బే డబ్బు.. మీ రాశి ఉందేమో చూసుకోండి!
బిగ్‌ అలర్ట్‌.. జూలై 1 నుండి మారనున్న 5 కీలక నిబంధనలు
బిగ్‌ అలర్ట్‌.. జూలై 1 నుండి మారనున్న 5 కీలక నిబంధనలు
హైదరాబాద్ తర్వాత అమరావతిలో బసవతారకం.. వైద్య సేవల ప్రారంభ తేదీపై..
హైదరాబాద్ తర్వాత అమరావతిలో బసవతారకం.. వైద్య సేవల ప్రారంభ తేదీపై..
‘ఆపరేషన్ సింధూర్’ అమరవీరులకు దక్కిన శాశ్వత గౌరవం!
‘ఆపరేషన్ సింధూర్’ అమరవీరులకు దక్కిన శాశ్వత గౌరవం!
ఇది ధైర్యమా,పిచ్చి సాహసమా? కింగ్ కోబ్రాకు నోటితో నీళ్లు తాగించాడు
ఇది ధైర్యమా,పిచ్చి సాహసమా? కింగ్ కోబ్రాకు నోటితో నీళ్లు తాగించాడు
పంచదార లేని పాయసం.. ఇలా చేస్తే నోటికి రుచి, శరీరానికి శక్తి
పంచదార లేని పాయసం.. ఇలా చేస్తే నోటికి రుచి, శరీరానికి శక్తి
అనుమానంగా కనిపించిన ఇద్దరు ప్రయాణికులు.. ఆపి చెక్ చేయగా
అనుమానంగా కనిపించిన ఇద్దరు ప్రయాణికులు.. ఆపి చెక్ చేయగా