Aadhar update: ఆధార్ అప్డేట్ ఆదేశాలు.. రోజుల తరబడి సెంటర్ల చుట్టూ క్యూలు కడుతోన్న జనాలు

|

Aug 18, 2021 | 6:59 PM

విజయవాడలోని ఆధార్ సెంటర్‌ల దగ్గర జనం బారులు తీరి పడిగాపులు పడుతున్నారు. ఐదు సంవత్సరాలు నిండిన పిల్లల ఆధార్ అప్డేట్ చేసుకోవాలని అధికారులు ఆదేశించడంతో జనం పెద్ద ఎత్తున

Aadhar update: ఆధార్ అప్డేట్ ఆదేశాలు.. రోజుల తరబడి సెంటర్ల చుట్టూ క్యూలు కడుతోన్న జనాలు
Aadhar Update
Follow us on

Aadhar update: విజయవాడలోని ఆధార్ సెంటర్‌ల దగ్గర జనం బారులు తీరి పడిగాపులు పడుతున్నారు. ఐదు సంవత్సరాలు నిండిన పిల్లల ఆధార్ అప్డేట్ చేసుకోవాలని అధికారులు ఆదేశించడంతో జనం పెద్ద ఎత్తున ఆధార్ కేంద్రాలకు క్యూకడుతున్నారు. రేషన్ కార్డ్‌లో అప్డేట్ లేని పేర్లు తొలగిస్తారని చెప్పడంతో మరింత ఆందోళనతో తల్లిదండ్రులు తమ చిన్నారుల పేర్లు నమోదు చేయించుకునేందుకు అక్కట్లు పడుతున్నారు. వారం రోజుల నుండి తమ పిల్లలతో ఆధార్ కేంద్రాల చుట్టు తిరుగుతున్నామని.. అయినా ఇంత వరకూ తమకు నమోదు ప్రక్రియ పూర్తి కావడం లేదని వాపోతున్నారు.

చాలా చోట్ల ఆయా ప్రాంతాలలోని ఆధార్ సెంటర్ లు పనిచేయకపోవడంతో బంధర్ రోడ్డులోని కార్వే ఆధార్ సెంటర్‌కు జనం తాకిడి విపరీతంగా పెరిగింది. ఉదయం ఆరు గంటల నుండే ఆధార్ సెంటర్ వద్ద క్యూలు కనిపిస్తున్నాయి. ఒక పక్క కొవిడ్ వ్యాప్తి చెందుతున్న సమయంలో ఆధార్ అప్డేట్ చేయాలని ఆదేశాలివ్వడం మీద బెజవాడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ముందుగా ఆన్లైన్‌లో స్లాట్ బుక్ చేసుకుని ఆధార్ అప్డేట్ చేపించు కోవాలంటున్నారు అధికారులు.

ఇలా ఉండగా, నగర ప్రజలను ఆధార్ కేవైసీ కష్టాలు కూడా వెంటాడుతున్నాయి. రేషన్ కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాలని జగన్ ప్రభుత్వం నిబంధన పెట్టిన విషయం తెలిసిందే. రెండు నెలల్లో కేవైసీ‌ చేయించు కోవాలని, లేని పక్షంలో రేషన్ కార్డులో పేరు పోతుందని ప్రభుత్వం ప్రకటించడంతో విజయవాడలోని కార్వే సెంటర్ వద్ద ప్రజలు బారులు తీరారు. కేవైసీ కోసం పిల్లలు, వృద్ధులు పడిగాపులు పడుతున్నారు. మరోవైపు ప్రజల రద్దీతో కరోనా బారిన పడతామనే ఆందోళన నేపథ్యంలో గతంలోలాగా మీ సేవా, ప్రైవేటు సెంటర్లకు కేవైసీ అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Read also: వాగులో చిక్కుకున్న భార్యను చాకచక్యంగా కాపాడిన భర్త.. ఆదిలాబాద్ జిల్లాలో సినీ ఫక్కీ దృశ్యాలు