గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అప్పు కట్టలేదని మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశారు. జిల్లాలో దుర్మార్గుడు అప్పు కట్టాలంటూ రెచ్చిపోయాడు. నకరికల్లు మండలం శివాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బోనముక్కల శ్రీనివాసరెడ్డి వద్ద బాధిత మహిళ 3.80 లక్షల అప్పు చేసింది. అప్పు తీర్చాలంటూ ఒత్తి తెచచాడు.
కరోనా సమయంలో తీర్చడం కష్టంగా ఉందంటూ ఆ మహిళ వేడుకుంది. దీంతో రెచ్చిపోయిన శ్రీనివాసరెడ్డి రమావంత్ మంత్రూభాయిని ట్రాక్టర్‌తో తొక్కించాడు. దీంతో బాధితురాలు అక్కడిక్కడే చనిపోయింది. పొలం తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు. అప్పు తీర్చలేదనే నెపంతో ఇవాళ పొలంలో పని చేసుకుంటున్న సమయంలో మంత్రూభాయిని శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ జరుపుతున్నారు.