పేకాట కొంపముంచింది..బెజ‌వాడ‌లో ఒక‌రి నుంచి 17 మందికి సోకిన క‌రోనా

విజయవాడ నగరంలో క‌రోనా ఇప్పుడు టెర్ర‌ర్ క్రియేట్ చేస్తోంది. ఇక్కడ నమోదవుతున్న కేసుల వ్యవహారం స్ధానికంగా అధికారులకు కునుకులేకుండా చేస్తున్నాయి. గ‌త‌ రెండు రోజుల వ్యవధిలో ఓ ఎస్సై, మరో లారీ డ్రైవర్ కారణంగా కేసులు పెరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. విజయవాడ కృష్ణలంకలోని గుర్రాల రాఘువయ్య వీధిలో స్ధానికంగా నివాసముంటున్న లారీ డ్రైవ‌ర్ కొద్దిరోజుల క్రితం పశ్చిమ బెంగాల్‌కు వెళ్లొచ్చాడు. అత‌నిలో ఎటువంటి క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌క‌పోవ‌డంతో త‌న ఫ్రెండ్స్ తో క‌లిసి పేకాట ఆడాడు. ఆ […]

పేకాట కొంపముంచింది..బెజ‌వాడ‌లో ఒక‌రి నుంచి 17 మందికి సోకిన క‌రోనా

Updated on: Apr 25, 2020 | 11:02 PM

విజయవాడ నగరంలో క‌రోనా ఇప్పుడు టెర్ర‌ర్ క్రియేట్ చేస్తోంది. ఇక్కడ నమోదవుతున్న కేసుల వ్యవహారం స్ధానికంగా అధికారులకు కునుకులేకుండా చేస్తున్నాయి. గ‌త‌ రెండు రోజుల వ్యవధిలో ఓ ఎస్సై, మరో లారీ డ్రైవర్ కారణంగా కేసులు పెరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.

విజయవాడ కృష్ణలంకలోని గుర్రాల రాఘువయ్య వీధిలో స్ధానికంగా నివాసముంటున్న లారీ డ్రైవ‌ర్ కొద్దిరోజుల క్రితం పశ్చిమ బెంగాల్‌కు వెళ్లొచ్చాడు. అత‌నిలో ఎటువంటి క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌క‌పోవ‌డంతో త‌న ఫ్రెండ్స్ తో క‌లిసి పేకాట ఆడాడు. ఆ త‌ర్వాత అత‌డికి సింట‌మ్స్ కనిపించ‌గా..టెస్ట్ చేస్తే కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. అత‌డితో పేకాట ఆడిన‌వారు భ‌యంతో అధికారులను ఆశ్రయించగా.. పరీక్షల్లో వారిలో 17 మందికి కరోనా వైరస్ వ్యాపించినట్లు తేలింది.
ఈ నేపథ్యంలో కృష్ణలంక ప్రాంతంపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు.