ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్ : రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రేటర్ నోయిడాలో ప్రయాణికులతో వస్తున్న డబుల్‌ డెక్కర్‌ బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 8 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. యమునా ఎక్స్‌ప్రెస్‌ వేలో ఆగ్రా నుంచి గ్రేటర్ నోయిడాకు ఉదయం ఐదు గంటల సమయంలో ఈ బస్సు వెళ్తోంది. […]

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

Edited By:

Updated on: Mar 29, 2019 | 12:58 PM

ఉత్తరప్రదేశ్ : రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రేటర్ నోయిడాలో ప్రయాణికులతో వస్తున్న డబుల్‌ డెక్కర్‌ బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 8 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది.

యమునా ఎక్స్‌ప్రెస్‌ వేలో ఆగ్రా నుంచి గ్రేటర్ నోయిడాకు ఉదయం ఐదు గంటల సమయంలో ఈ బస్సు వెళ్తోంది. నోయిడా సమీపంలోని రబుపురా వద్ద బస్సు బ్రేకులు ఫెయిల్‌ అవ్వడంతో అదుపుతప్పి.. ఎదురుగా వస్తున్న  ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం దాదాపు సగం వరకు పూర్తిగా ధ్వంసమయ్యింది. దీంతో ఎనిమిది మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.  క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.