57% vehicles in India uninsured మీరు మీ బైక్ ఇన్సూరెన్స్ చేయించారా..? దేశంలో ఉన్న ఎన్ని వాహనాలు ఇన్సూరెన్స్ లేకుండా తీరుగుతున్నాయో తెలుసా…? ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపిన వివరాల ప్రకారం దేశ వ్యాప్తంగా ఉన్న వాహనాల్లో 57 శాతానికి పైగా వాహనాలు ఎటువంటి ఇన్సూరెన్స్ లేకుండా తిరుగుతున్నాయని తాజాగా ప్రకటించింది. ఈ శాతం 2018లో 54 శాతం కాగా, 2019 నాటికి 57 శాతానికి పెరిగిందని తెలిపింది. అంటే 23 కోట్ల వాహనాల్లో దాదాపు 13.2 కోట్ల వాహనాలు ఎటువంటి ఇన్సూరెన్స్ లేకుండానే రోడ్లపై తిరుగుతున్నాయన్న మాట. కాగా మహారాష్ట్ర ప్రభుత్వం వాహనదారులపై 600 కోట్ల రూపాయల ఫైన్లను విధించింది.