కోళికోడ్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ క్రాష్: 56 మంది ప్యాసింజర్లు డిశ్చార్జి!

| Edited By:

Aug 10, 2020 | 4:37 PM

కేరళలోని కోళికోడ్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాద గతంలో గాయపడిన 56 మంది ప్రయాణికులను వివిధ దవాఖానల నుంచి డిశ్చార్జి చేసినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సోమవారం తెలిపింది. పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి

కోళికోడ్  ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ క్రాష్: 56 మంది ప్యాసింజర్లు డిశ్చార్జి!
Follow us on

కేరళలోని కోళికోడ్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాద గతంలో గాయపడిన 56 మంది ప్రయాణికులను వివిధ దవాఖానల నుంచి డిశ్చార్జి చేసినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సోమవారం తెలిపింది. పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ 149 మందిని దవాఖానల్లో చేర్చగా శనివారం 23 మంది డిశ్చార్జి కాగా ఇప్పటి వరకు 56 మంది పూర్తిగా కోలుకున్నట్లు తెలిపారు. ముగ్గురు తీవ్రంగా గాయపడగా వారికి మెరుగైన చికిత్స అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.

కేరళలో భారీ వర్షాల కారణంగా శుక్రవారం రాత్రి కోళికోడ్ విమానాశ్రయంలో 190 మందితో దిగిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం టేబుల్‌టాప్ రన్‌వేను ఓవర్‌షాట్ చేసి 35 అడుగుల దిగువ లోయలో పడి రెండుగా విరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు సహా 18 మంది మృత్యువాత పడ్డారు. విమాన ప్రమాదంలో మరణించిన 16 మంది ప్రయాణికుల మృత అవశేషాలను వారి కుటుంబాలకు అప్పగించామని, ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని ఎయిర్‌లైన్స్ తెలిపింది.

Read More:

గుడ్ న్యూస్: తెలంగాణ ఆస్పత్రుల్లో ఇక ఆర్‌టీ-పీసీఆర్‌ ద్వారా కరోనా టెస్ట్..!

తెలంగాణలో కొలువుల జాతర.. కార్మిక ఉపాధి కల్పన శాఖ కొత్త ప్లాన్‌..!