రాహుల్ రాజీనామాకు 50 రోజులు.. వారసులెవరో తేల్చని పార్టీ..

|

Jul 16, 2019 | 10:00 AM

కాంగ్రెస్ పార్టీ చీఫ్ పదవికి రాహుల్ రాజీనామా చేసి.. నిన్నటికి 50 రోజులు గడిచిపోయాయి. రోజులు గడుస్తున్నా కొత్త లీడర్ ఎంపికపై నిర్లక్ష్యం చేయడంతో పార్టీకి షాక్‌లు ఎదురవుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ.. మే 25న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాహుల్ తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నాయకుడు లేకపోవడంతో.. ప్రస్తుతం కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు పార్టీ మల్లగుల్లాడు పడుతోంది. అయితే పార్టీ రూల్స్ ప్రకారం రాహుల్ స్థానంలో […]

రాహుల్ రాజీనామాకు 50 రోజులు.. వారసులెవరో తేల్చని పార్టీ..
Follow us on

కాంగ్రెస్ పార్టీ చీఫ్ పదవికి రాహుల్ రాజీనామా చేసి.. నిన్నటికి 50 రోజులు గడిచిపోయాయి. రోజులు గడుస్తున్నా కొత్త లీడర్ ఎంపికపై నిర్లక్ష్యం చేయడంతో పార్టీకి షాక్‌లు ఎదురవుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ.. మే 25న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాహుల్ తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నాయకుడు లేకపోవడంతో.. ప్రస్తుతం కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు పార్టీ మల్లగుల్లాడు పడుతోంది.

అయితే పార్టీ రూల్స్ ప్రకారం రాహుల్ స్థానంలో కొత్త చీఫ్‌ను ఎన్నుకునే అధికారం సీడబ్ల్యూసీకి ఉంది. అయినప్పటికీ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై పార్టీ క్లారిటీ ఇవ్వలేదు. గత 50 రోజుల్లో రెండుసార్లు వార్‌రూమ్ మీటింగ్స్ పెట్టినా, వాటిలో కర్నాటక రాజకీయాల ప్రస్తావనే తప్ప వారసుడి ఎంపికపై చర్చ జరగలేదు. కర్నాటక క్రైసిస్ వల్ల వారసుడి ఎంపిక ఆలస్యం అవుతోందని ఏఐసీసీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

మొత్తానికి రాహుల్ రాజీనామా తర్వాత చాలా రాష్ట్రాల్లో పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. కర్నాటకకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ పై సుప్రీం కోర్టుకు వెళ్లారు. గోవాలో మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరారు. ఇక ఢిల్లీలో పీసీసీ చీఫ్ షీలా దీక్షిత్ , ఏఐసీసీ ఇన్‌ఛార్జి పీసీ చాకో మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. మహారాష్ట్ర, ముంబై, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అసలే లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో డీలా పడ్డ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో స్థిరమైన నాయకుడు లేని కారణంగా రాష్ట్రాల్లో పరిస్థితి అద్వానంగా తయారైంది.