కర్ణాటకలోని ధర్మస్థల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతులు చిత్తూరు జిల్లా కుర్చివేడు వాసులుగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. పొలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.