భారత్ లో 425 కరోనా కేసులు.. ప్రపంచవ్యాప్తంగా 15వేలు దాటిన కరోనా మరణాలు..!

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. దేశవ్యాప్తంగా 396 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్‌ఆర్‌) బులెటిన్‌ విడుదల చేసింది.

భారత్ లో 425 కరోనా కేసులు.. ప్రపంచవ్యాప్తంగా 15వేలు దాటిన కరోనా మరణాలు..!

Edited By:

Updated on: Mar 23, 2020 | 4:43 PM

భారత్ లో కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. దేశవ్యాప్తంగా 425 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్‌ఆర్‌) బులెటిన్‌ విడుదల చేసింది. దేశంలో 17237 మంది నుంచి 18,127 నమూనాలను సేకరించి పరీక్షలు చేసినట్లు అందులో పేర్కొంది. శనివారం మొత్తం 79 కేసులు నమోదు కాగా..ఆదివారం 81 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు బులెటిన్‌లో పేర్కొంది.

మహారాష్ట్రలో ధృవీకరించబడిన కరోనావైరస్ కేసుల సంఖ్య గత 24 గంటల్లో బాగా పెరిగింది, రాష్ట్ర అధికారులు 15 కొత్త కేసులను నివేదించారు. దేశంలో కరోనా కలకలం రేపుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యలు ముమ్మరం చేశాయి. ప్రధాని పిలుపు మేరకు ఆదివారం నిర్వహించిన జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. ప్రజలు స్వచ్ఛందంగా ఇంటికే పరిమితమైపోయారు దుకాణాలు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేటు రవాణా వ్యవస్థలు స్తంభించిపోయాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇండియన్‌ రైల్వే కూడా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యలు చేపట్టింది. మార్చి 31వరకు అన్ని ప్యాసెంజర్‌ సర్వీసులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి తన పట్టును బిగుస్తోంది. ఇప్పటివరకు 184 దేశాలకు వైరస్‌ విస్తరించింది. అనేక దేశాలను నిర్బంధంలోకి నెట్టింది. ప్రజల్ని ఇళ్లకే పరిమితం చేసింది. తొలుత వెలుగులోకి వచ్చిన చైనాలో వైరస్‌ భారీగా తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోంది. ఇరాన్ లో మృతుల సంఖ్య 1556కు చేరింది. మరో 966 కొత్త కేసులు నమోదవడంతో బాధితుల సంఖ్య 20,610కి పెరిగింది. అయితే మరో 15 రోజుల్లో వైరస్‌ వ్యాప్తిని అదుపులోకి తెస్తామని అధ్యక్షుడు హసన్‌ రౌహానీ హామీ ఇవ్వడం గమనార్హం. ఇప్పటి వరకు వైరస్‌ తీవ్రత కాస్త తక్కువగా ఉన్న ఆఫ్రికా ఖండంలోనూ కఠిన ఆంక్షలు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్‌ వల్ల ఏర్పడిన ఆర్థికపరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం 38 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది. ఫ్రాన్స్‌లో కరోనా పోరులో భాగంగా హెలికాప్టర్లు, డ్రోన్లను రంగంలోకి దించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా నిఘా వేసేందుకు వీటిని ఉపయోగించనున్నారు.