శాంతి పూజల పేరుతో.. దారుణం..!

|

Jun 11, 2020 | 3:05 PM

కరోనా నిర్మూలన పేరుతో జార్ఖండ్‌లోని కోడెర్మా జిల్లాలో శాంతి పూజ‌ల పేరిట 400 గొర్రెల‌ బ‌లి.

శాంతి పూజల పేరుతో.. దారుణం..!
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా కరోనా రక్కసి వెంటాడుతోంది. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. వేలాది మంది ప్రాణాలు హరిస్తున్నాయి. ఈ నేప‌ధ్యంలో వైద్య ప‌రిశోధ‌న‌కులు కరోనా నివార‌ణ‌కు వ్యాక్సిన్ క‌నిపెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే కరోనా నిర్మూలన పేరుతో జార్ఖండ్‌లోని కోడెర్మా జిల్లాలో శాంతి పూజ‌ల పేరిట 400 గొర్రెల‌ను బ‌లి ఇచ్చిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. చంద్వారా బ్లాక్ పరిధిలో గ‌ల‌ ఉర్వాన్ గ్రామంలోని అమ్మ‌వారి ఆలయంలో కరోనా శాంతి పూజ‌లు నిర్వ‌హించారు. అమ్మవారి మెప్పుకోసం కోళ్ల‌తో పాటు 400 గొర్రెల‌ను బ‌లిచ్చారు. దీంతో కరోనా నుండి త‌మ గ్రామానికి విముక్తి క‌లుగుతుంద‌ని గ్రామ ప్రజలు నమ్ముతున్నారు. అయితే ఈ కార్య‌క్ర‌మం ఎవ‌రు నిర్వ‌హించార‌నేది ఇంకా వెల్ల‌డి కాలేదు. మ‌రోవైపు దేవాలయాలలో గొర్రెల‌ను బలి ఇచ్చేటప్పుడు సామాజిక దూరం పాటించలేదని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు బాధితులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.