
దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో కరోనా కట్టడికోసం జపాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ జపాన్ లో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. బుధవారం సాయంత్రం నాటికి అందిన సమాచారం మేరకు జపాన్ లో కొత్తగా 366 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం పేర్కొంది. టోక్యోలో రికార్డు స్థాయిలో కొత్తగా 366 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం పేర్కొంది.
కోవిద్-19 కేసుల సంఖ్య మే చివరిలో చాలా వరకు పడిపోయిందని, అయితే జూన్ చివరి నుంచి అంటువ్యాధులు స్థిరంగా పెరిగాయని, జూలై మొదటి మూడు వారాల్లో ఈ సంఖ్య మూడు రెట్లకు పెరిగిందని జపాన్ ప్రభుత్వం తెలిపింది. టోక్యోలో కరోనా వల్ల ఇప్పటి వరకు 327 మృతి చెందారు. మొత్తం 10,420 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జపాన్ ప్రభుత్వం పేర్కొంది.
Also Read: ఎంట్రెన్స్ పరీక్షలు రద్దు.. డీమ్డ్ వర్సిటీలకు డిమాండ్..