ప్రస్తుత విద్యా సంవత్సరంలో 351 ప్రొఫెషనల్ కాలేజీలు మూతపడే అవకాశం ఉంది. నూతన ఫీజుల దరఖాస్తుకు ఆ కాలేజీలు దూరంగా ఉన్నాయి. 2019 నుంచి 2022 వరకు మూడేళ్లకు గానూ కాలేజీల ఫీజులు నిర్ణయించేందుకు తెలంగాణ ఫీ రెగ్యులేటరీ కమిటీ(టీఎఫ్‍ఆర్‍సీ)కి కాలేజీలు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. గత మూడేళ్ల ఆదాయ, వ్యయాలను కూడా అందిస్తే కాలేజీలు వసూలు చేసే ఫీజును కమిటీ నిర్ణయిస్తుంది. ఇందుకోసం టీఎఫ్‍ఆర్‍సీ దరఖాస్తులు ఆహ్వానించగా, 1235 కాలేజీలే దరఖాస్తు చేసుకున్నాయి. 2016 లో 1586 కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఫీజుల కోసం దరఖాస్తు చేసుకోని కాలేజీలకి అనుమతి ఉండదు. తమ కాలేజీని మూసివేస్తున్నట్లు కాలేజీ యాజమాన్యం చెప్పడమే ఉంటుంది.