బెంగాల్ తొలి దశ ఎన్నికల్లో 26 సీట్లు నాడు తృణమూల్ కాంగ్రెస్ వే ! మరి, ఈ సారి ఫలితం ఎలా ఉంటుందో ?
బెంగాల్ తొలి దశ ఎన్నికల్లో 30 నియోజకవర్గాల నుంచి 73 లక్షలమంది ఓటర్లు శనివారం తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పురూలియా, జార్ గ్రామ్ నియోజకవర్గాలతో బాటు బంకూరా జిల్లాలోని...
బెంగాల్ తొలి దశ ఎన్నికల్లో 30 నియోజకవర్గాల నుంచి 73 లక్షలమంది ఓటర్లు శనివారం తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పురూలియా, జార్ గ్రామ్ నియోజకవర్గాలతో బాటు బంకూరా జిల్లాలోని కొన్ని స్థానాలు, వెస్ట్, ఈస్ట్ మిడ్నపూర్ జిల్లాల్లోని మరి కొన్ని నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. 191 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొదటి దశలో తమ బలాధిక్యతను ప్రదర్శించుకునేందుకు ప్రధాన పార్టీలైన బీజేపీ, టీఎంసీ పోటీ పడుతున్నాయి. ఈ తొలిదశ ఎన్నికల్లో ఓ నటుడి భవితవ్యం కూడా తేలనుంది. 2016 లో జరిగిన ఎన్నికల్లో 30 సీట్లలో 26 స్థానాలను తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంది. ప్రస్తుతం ఈ సారి ఎన్నికకు బీజేపీ, టీఎంసీ 29 సీట్లకు పోటీ చేస్తున్నాయి. మరో చోట ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఆయనకు పోటీగా బీజేపీ లేదా టీఎంసీ తమ అభ్యర్థులను రంగంలోకి దింపలేదు.
ఈ ఫస్ట్ ఫేజ్ ఎన్నికల్లో కాంగ్రెస్ 10 సీట్లకు, లెఫ్ట్ పార్టీలు 18 స్థానాలకు పోటీ చేస్తున్నాయి. ముఖ్యంగా జార్ గ్రామ్, ఖేజూరీ. పొతాష్ పూర్ స్థానాలపై బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ దృష్టి పెట్టాయి. బంకూరా జిల్లాలో 40 శాతం మందికి పైగా ఎస్సీ, ఎస్టీ ఓటర్లు ఉన్నారు. ఈస్ట్ మిడ్నపూర్ జిల్లాలో బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి హవా ఎక్కువగా ఉంది. నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన.. ఇక్కడ తన విజయం సునాయాసమని చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మమతా బెనర్జీపై తను 50 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ఆయ సువెందు అధికారి తరఫున సినీ నటుడు మిథున్ చక్రవర్తి ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన తన సినీ డైలాగులతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. అయితే ఈ డైలాగులు అధికారిని విజయపథం వైపు నడిపిస్తాయా లేదా అన్నది చూడాలి.
మరిన్ని చదవండి ఇక్కడ :పురోహితుల క్రికెట్ లీగ్ మీరు ఎప్పుడైనా చూశారా..!సిక్సర్లు,ఫోర్లతో దుమ్ములేచిన గ్రౌండ్ : Pandits Cricket League video.
Telangana: లాక్ డౌన్ పెట్టేది లేదు అని తేల్చి చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం… ( వీడియో )
భారీగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు…!! దీనికి ఆ నౌకే కారణం… ( వీడియో )