బీజేపీని ఆశీర్వదిస్తున్న అందరికీ థ్యాంక్స్ : స్మృతి ఇరానీ

| Edited By:

May 22, 2019 | 6:53 PM

కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ దేశ ప్రజలకు, ఆ పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. గత ఐదేళ్ళ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, బీజేపీని ఆశీర్వదిస్తున్న లక్షలాది మందికి ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు. In the last 5 years not a day went by when Narendra Modi was not subjected to humiliation and hateful barbs by the opposition. However, as karyakartas we […]

బీజేపీని ఆశీర్వదిస్తున్న అందరికీ థ్యాంక్స్ : స్మృతి ఇరానీ
Follow us on

కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ దేశ ప్రజలకు, ఆ పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. గత ఐదేళ్ళ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, బీజేపీని ఆశీర్వదిస్తున్న లక్షలాది మందికి ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు.

మరో కొద్ది గంటలు గడవవలసి ఉందని.. ప్రతి అంశంపైన విశ్లేషణను తెలుసుకుంటూ.. రేపు అత్యధికులు టెలివిజన్లకు అతుక్కుపోతామని… దేశ వ్యాప్తంగా నా పార్టీని, నా అధినాయకత్వాన్ని లక్షలాది మంది ఆశీర్వదిస్తున్నందుకు ధన్యవాదాలు చెబుతున్నానని ట్వీట్‌లో పేర్కొన్నారు.

వ్యక్తిగతంగా ఏ పదవినీ, ఏ కీర్తినీ కోరుకోనని.. కార్యకర్తల పట్టుదల, త్యాగ గుణం, కఠోర శ్రమలను చూడటం మా అందరికీ గర్వకారణమని.. అందరితో కలిసి, అందరి అభివృద్ధికి కట్టుబడిన, చురుకైన నవ భారత నిర్మాణం పట్ల బలమైన ఆకాంక్ష మాత్రమే వారిని నడుపుతోందని మరో ట్వీట్‌లో తెలిపారు.

ఈ సందర్భంగా కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీ కార్యకర్తల త్యాగాలను ఆమె గుర్తు చేశారు. కార్యకర్తలతోపాటు వారి కుటుంబాలు చేసిన త్యాగాలను కొనియాడారు. ప్రాణాలను అర్పించినవారికి శ్రద్ధాంజలి ఘటించడానికి మాటలు చాలవని ఆవేదన వ్యక్తం చేస్తూ మరో ట్వీట్ చేశారు.