నదిలో ఢీ కొట్టుకున్న రెండు పడవలు.. 23 మంది మృతి..

బంగ్లాదేశ్‌లో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. బురిగంగా నదిలో పడవలు ఢీ కొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఓ పడవ నీట మునిగింది. దీంతో 23 మంది జలసమాధి అయ్యారు.

నదిలో ఢీ కొట్టుకున్న రెండు పడవలు.. 23 మంది మృతి..

Edited By:

Updated on: Jun 29, 2020 | 2:10 PM

బంగ్లాదేశ్‌లో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. బురిగంగా నదిలో పడవలు ఢీ కొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఓ పడవ నీట మునిగింది. దీంతో 23 మంది జలసమాధి అయ్యారు. మార్నింగ్ బర్డ్ అనే ఓ పడవ.. మున్షిగంజ్‌ నుంచి సదర్‌ ఘాట్‌ వైపు వెళ్తున్న క్రమంలో.. మౌయూరీ-2 అనే పడవను ఢీ కొట్టింది. ఈ క్రమంలో ఓ పడవ నీటమునిగింది. ప్రమాద సమయంలో పడవలో 50 మంది ఉన్నట్లు సమాచారం. అందులో పలువురు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు కాపాడుకోగా. 23 మంది జలసమాధి అయ్యారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతోంది.