West Bengal Politics Heat :పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా దినాజ్‌పూర్ నగరంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు కార్యకర్తలు మృతి చెందారు. ఈ హత్య ఘటనకు సంబంధం ఉన్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని సౌత్ దినాజ్ పూర్ ఎస్పీ దేబర్షి దత్తా చెప్పారు.
మరోవైపు ఫుర్బా బర్ధమాన్ జిల్లాలో అధికార టిఎంసి, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వాతావరణం వేడెక్కింది. అధికార పార్టీ తృణమూల్ బీజేపీ కార్యకర్తల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు.
Also Read: తీవ్ర దుమారం రేపుతున్న ఏపీ డీజీపీ వ్యాఖ్యలు.. బీజేపీ కార్యాచరణపై ఉత్కంఠ..