Hyderabad : షీ టీమ్స్‌కు అక్టోబర్ నెలలో 137 ఫిర్యాదులు
సోషల్ మీడియా ట్రాప్స్, నగ్న చిత్రాలతో బెదిరింపులు, పెళ్లి పేరుతో చీటింగులు, ఆఫీసుల్లో, పాఠశాల్లో వేధింపులు .. వీటిపై హాక్‌ఐ, వాట్సాప్, సోషల్ మీడియా, ఇతర వేదికల ద్వారా అక్టోబర్ నెలలో మొత్తం 137 కంప్లైంటులు సైబరాబాద్ షీ టీమ్స్‌కు వచ్చాయి.
సోషల్ మీడియా ట్రాప్స్, నగ్న చిత్రాలతో బెదిరింపులు, పెళ్లి పేరుతో చీటింగులు, ఆఫీసుల్లో, పాఠశాల్లో వేధింపులు ..వీటిపై హాక్‌ఐ, వాట్సాప్, సోషల్ మీడియా, ఇతర వేదికల ద్వారా అక్టోబర్ నెలలో మొత్తం 137 కంప్లైంటులు సైబరాబాద్ షీ టీమ్స్‌కు వచ్చాయి. వీటిని పూర్తి స్థాయిలో విశ్లేషించిన అధికారులు 45 కేసులను ఫైల్ చేశారు. అందులో 28 పెట్టీ కేసులు ఉండగా… 17 మందిపై క్రిమనల్ కేసులు నమోదు చేశారు. మొత్తం 56 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. అదే విధంగా వివిధ సమస్యలపై సైబరాబాద్ షీ టీమ్స్ డయల్ 100కు వచ్చిన 80 ఫోన్ కాల్స్‌కు స్పందించి.. వారి సమస్యలను పరిష్కరించారు.
షీ టీమ్స్‌కు వచ్చిన కొన్ని కేసుల వివరాలు ఇలా ఉన్నాయి..
- రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపాల్ దేవ్‌దాస్ తోటి టీచర్‌ను వేధించాడు.
- జగద్గిరిగుట్టలో 60 ఏళ్ల వృద్ధుడు ఆరు సంవత్సరాల బాలికతో తప్పుగా ప్రవర్తించాడు.
- కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లోని ఓ సూపర్ మార్కెట్‌లో టీమ్ లీడర్ నారాయణ.. తోటి ఉద్యోగిరాలితో అసభ్యకరంగా ప్రవర్తించాడు.
- జగద్గిరిగుట్టకు చెందిన జహంగీర్ అనే వ్యక్తి వరసకు కూతురు అయ్యే యువతితో తప్పుగా ప్రవర్తించాడు
- షార్ట్ ఫిల్మ్‌లో అవకాశం కల్పిస్తానని ఫొటో, వీడియోలు సేకరించి రెమ్యూనరేషన్ విషయంలో విబేధాలు రావడంతో.. నరేశ్ అనే వ్యక్తి యువతిని వేధించాడు ఫిర్యాదు.
- ఓ ఆస్పత్రిలో నర్సును అక్కడే ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న విజయ్ పెళ్లి చేసుకోమని వేధించాడు. ఫిర్యాదు అందడంతో రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read :