పుణేలో కరోనా టెర్రర్.. ఒక్కరోజే 1264 మందికి..

| Edited By:

Jul 03, 2020 | 2:36 AM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. మహారాష్ట్రలోని పుణే జిల్లాలో కరోనా పెను విలయం సృష్టిస్తోంది. ఇవాళ ఒక్కరోజే ఇక్కడ 1264 మందికి కరోనా

పుణేలో కరోనా టెర్రర్.. ఒక్కరోజే 1264 మందికి..
Follow us on

coronavirus cases in Pune: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. మహారాష్ట్రలోని పుణే జిల్లాలో కరోనా పెను విలయం సృష్టిస్తోంది. ఇవాళ ఒక్కరోజే ఇక్కడ 1264 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 24,944కు పెరిగినట్టు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కాగా ఈ మహమ్మారి కారణంగా మరో 18 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 806కు చేరింది.

మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ‘‘కొత్తగా నమోదైన 1264 కేసుల్లో ఒక్క పుణే మున్సిపాలిటీ నుంచే 855 కేసులు వచ్చాయి. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 19,011కి చేరింది..’’ అని ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా ఇవాళ 631 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Also Read: అసోంలో వరద బీభత్సం.. 33కు పెరిగిన మృతుల సంఖ్య..