ఐపీఎల్ 2019 ఆరంభ మ్యాచ్‌లకి విలియమ్సన్ దూరం
గత ఏడాది కెప్టెన్‌గా జట్టుని నడిపించిన కేన్ విలియమ్సన్.. గాయం కారణంగా ఈ ఏడాది ఆరంభ మ్యాచ్‌లకి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్‌తో తాజాగా ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ ఈ న్యూజిలాండ్ కెప్టెన్ గాయపడ్డాడు. వెంటనే.. సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స చేసిన వైద్యులు స్కానింగ్ తీసిన తర్వాత.. గాయం తీవ్రత దృష్ట్యా కొన్నిరోజులు విశ్రాంతి అవసరమని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో.. శనివారం నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభంకానున్న మూడో టెస్టుకి విలియమ్సన్ దూరంగా […]
గత ఏడాది కెప్టెన్‌గా జట్టుని నడిపించిన కేన్ విలియమ్సన్.. గాయం కారణంగా ఈ ఏడాది ఆరంభ మ్యాచ్‌లకి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్‌తో తాజాగా ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ ఈ న్యూజిలాండ్ కెప్టెన్ గాయపడ్డాడు. వెంటనే.. సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స చేసిన వైద్యులు స్కానింగ్ తీసిన తర్వాత.. గాయం తీవ్రత దృష్ట్యా కొన్నిరోజులు విశ్రాంతి అవసరమని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో.. శనివారం నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభంకానున్న మూడో టెస్టుకి విలియమ్సన్ దూరంగా ఉండనున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. మార్చి 23 నుంచి అంటే.. మరో 11 రోజుల్లోనే ఐపీఎల్ 2019 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి.
Injury update: Williamson in doubt for the third Test after an MRI confirmed a grade one tear to his left pectoral minor muscle. He will travel to Christchurch with us to be further assessed. The third Test starts on Saturday. #NZvBAN pic.twitter.com/ca83KFarb2
— BLACKCAPS (@BLACKCAPS) March 12, 2019