ఈ ఏడాది ఐపీఎల్‌తో బీసీసీఐకి భారీ ఆదాయం.. ఏకంగా 4వేల కోట్ల రెవెన్యూ
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ ఉంటుందా..? ఉండదా..? అన్న అనుమానాలకు చెక్ పెడుతూ బీసీసీఐ ఐపీఎల్‌ని దుబాయ్‌లో ఘనంగా నిర్వహించింది.
IPL 2020 revenue: కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ ఉంటుందా..? ఉండదా..? అన్న అనుమానాలకు చెక్ పెడుతూ బీసీసీఐ ఐపీఎల్‌ని దుబాయ్‌లో ఘనంగా నిర్వహించింది. కరోనా నిబంధనలను పాటిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా బీసీసీఐ, ఈ సీజన్‌ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇక ఈ సీజన్ విజేతగా ముంబై ఇండియన్స్ గెలవగా.. ఐదోసారి ఐపీఎల్ కప్పును ఖాతాలో వేసుకుంది రోహిత్ సేన. ఇదిలా ఉంటే ఈ సీజన్ ద్వారా బీసీసీఐకి భారీ ఆదాయం ముట్టింది. ( ఢిల్లీలో పెరగుతున్న కరోనా కేసులు.. పంజాబీ బస్తీ, జనతా మార్కెట్ మూసివేయాలంటూ ఆదేశాలు)
ఏకంగా 4వేల కోట్ల రెవెన్యూ ఐపీఎల్ 2020 నుంచి తమకు వచ్చినట్లు బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ అన్నారు. అంతేకాదు టీవీ వ్యూయర్‌షిప్ కూడా గతేడాదితో పోలిస్తే 25 శాతం పెరిగినట్లు ఆయన తెలిపారు. కరోనా నేపథ్యంలో ఆడియెన్స్‌ని అనుమతించకపోగా.. అందరూ ఇళ్లలోనే ఉండి ఐపీఎల్‌ని వీక్షించారు. ఈ నేపథ్యంలో వ్యూయర్‌షిప్ కూడా బాగా పెరగ్గా.. ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌కి రికార్డు టీఆర్ప నమోదైంది. అలాగే గతేడాదితో పోలీస్తే ఈ ఏడాది దాదాపుగా 35శాతం ఖర్చులను బోర్డు కట్ చేసినట్లు అరుణ్ పేర్కొన్నారు. ఇక ఈ ఐపీఎల్‌లో భాగంగా 18వందల మందికి 30వేలకు పైగా కరోనా టెస్ట్‌లు నిర్వహించినట్లు అరుణ్ తెలిపారు. (కరోనా అప్‌డేట్స్: తెలంగాణలో 602 కొత్త కేసులు.. ముగ్గరు మృతి.. కోలుకున్న 1,015 మంది)