ఇంగ్లండ్ 386/6… బంగ్లాకు భారీ లక్ష్యం

ICC, ఇంగ్లండ్ 386/6… బంగ్లాకు భారీ లక్ష్యం

ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా సోఫియా గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ చెలరేగిపోయారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. జేసన్ రాయ్ సెంచరీ, బెయిర్‌స్టో, బట్లర్‌ల అర్థశతకాలతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 386 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో రాయ్ 153, బట్లర్ 64, బెయిర్‌స్టో 51, మోర్గన్ 35 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలింగ్‌లో సైఫుద్దీన్, హసన్ చెరి రెండు, మోర్తజా, రహ్మన్ తలో వికెట్ తీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *