అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం.. టీమిండియా మహిళా క్రికెటర్ ప్రియా పునియా
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌కి దక్షిణాదిన మాత్రమే కాదు ఉత్తరాదిన కూడా మంచి క్రేజ్ ఉంది. తనదైన స్టైల్, యాక్టింగ్, డ్యాన్స్‌తో ఉత్తరాదిన కూడా అభిమానులను సంపాదించుకున్నారు బన్నీ

Priya Punia Allu Arjun: స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌కి దక్షిణాదిన మాత్రమే కాదు ఉత్తరాదిన కూడా మంచి క్రేజ్ ఉంది. తనదైన స్టైల్, యాక్టింగ్, డ్యాన్స్‌తో ఉత్తరాదిన కూడా అభిమానులను సంపాదించుకున్నారు బన్నీ. ఈ క్రమంలో పలువురు సినీ, క్రీడా ప్రముఖులు కూడా బన్నీ అభిమానుల లిస్ట్‌లో ఉన్నారు. వారిలో టీమిండియా మహిళా క్రికెటర్ ప్రియా పునియా కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఆమే వెల్లడించారు. (Bigg Boss 4: గ్రాండ్ ఫినాలే అప్పుడే.. ప్రణాళికలు సిద్ధం చేస్తోన్న నిర్వాహకులు)
ఇటీవల సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటించిన ప్రియా.. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో తనకు ఇష్టమైన దక్షిణాది నటుడు అల్లు అర్జున్ అని చెప్పుకొచ్చారు. అలాగే తనకు ఇష్టమైన రాజస్థానీ వంటకం చూర్మా లడ్డూ అని పేర్కొన్నారు. ఇక క్రికెట్‌లో రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ తనకు ఆదర్శమని ఈ యువ క్రికెటర్ చెప్పుకొచ్చారు. కాగా 2016లో ఢిల్లీ తరఫున మెరిసిన పునియా.. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటివరకు ఇండియా తరఫున ఆమె 5 వన్డేలు, 3 టీ20లు ఆడారు. (సెప్టెంబర్‌లోనే పెళ్లి చేసుకున్న ప్రభుదేవా.. పెళ్లికూతురు బంధువుల అమ్మాయి కాదట.. మరెవరంటే!)