24 April 2025
నోరు తెరిస్తే వివాదమే.. స్పెషల్ పాటలతో ఫేమస్..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా స్పెషల్ పాటలతో దూసుకుపోతుంది. తక్కువ సమయంలోనే ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకుంది ఈ వయ్యారి.
కానీ ఇంటర్వ్యూలలో ఈ అమ్మడు చేసే కామెంట్స్ నిత్యం వివాదాస్పదమవుతుంటాయి. ఇప్పటికే చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడింది.
ఆమె మరెవరో కాదు హీరోయిన్ ఊర్వశి రౌతేలా. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ అంటూ చిందులేసింది ఈ బ్యూటీ.
ఆ తర్వాత బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాలో దబిడి దిబిడి పాటతో మరింత పాపులర్ అయ్యింది. తెలుగులో మరిన్ని ఆఫర్స్ అందుకుంటుంది.
ఊర్వశి రౌతేలా చేసే మాస్ స్పెషల్ పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో ఈ అమ్మడుకు తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయి.
అటు స్పెషల్ సాంగ్ చేసేందుకు ఎక్కువగానే పారితోషికం తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ అమ్మడు బిజీ అని చెప్పుకుంటుంది.
కానీ ఇంటర్వ్యూలో ఈ అమ్మడు చేసి కామెంట్స్ అతిగా ఉంటున్నాయని మండిపడుతున్నారు నెటిజన్స్. ఎప్పుడూ తన గొప్పలు చెప్పేందుకు ట్రై చేస్తుంది ఈ బ్యూటీ.
చాలా మంది దర్శకులు తనను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నారని.. సినిమాల్లో నటింపజేందుకు పోటీ పడుతున్నారంటూ కాస్త అతిగా వ్యాఖ్యలు చేసింది ఈ బ్యూటీ.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్