Aeroplane Fact: బస్సులో నిలబడి వెళ్లినట్లు విమానంలో ప్రయాణించవచ్చా ?.. ఇలా జరిగితే ఏమవుతుందో తెలుసా..

|

Dec 29, 2022 | 1:40 PM

ఈ ప్రశ్నకు సమాధానం లేదని మీకు అనిపిస్తే.. మీరు ఆపరేషన్ సోలమన్ కథను తెలుసుకోవాలి.. ఈ కథనంలో వాస్తవాలు, తర్కం తప్పు అని రుజువు చేస్తుంది.

Aeroplane Fact: బస్సులో నిలబడి వెళ్లినట్లు విమానంలో ప్రయాణించవచ్చా ?.. ఇలా జరిగితే ఏమవుతుందో తెలుసా..
Travel By Standing In Aeroplane
Follow us on

మన భారతదేశంలో చాలా మంది బస్సులో నిలబడి ప్రయాణించడం మీరు తప్పక చూసి ఉంటారు. మీరు బస్సు, రైలు లేదా మెట్రోలో నిలబడి కూడా ప్రయాణించి ఉండవచ్చు. ఇది ఇక్కడ సర్వసాధారణం. భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోని కొన్ని ఇతర దేశాలలో కూడా ప్రయాణీకులు ప్రజా రవాణాలో నిలబడి ప్రయాణిస్తారు. బస్సు, రైలు,మెట్రో ట్రైన్‌లో ఇది మనం నిత్యం చూస్తుంటాం. మన హైదరాబాద్, వాణిజ్య నగరం ముంబై లాంటి ప్రాంతాల్లో ఇది మరీ రద్దీగా ఉంటుంది. అయితే ఇలా నిలబడి విమానంలో ప్రయాణించగలరా..? అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? ఈ ప్రశ్నకు సమాధానాన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.

బస్సుల్లో, రైళ్లలో నిలబడి ప్రయాణించడం మనం కామన్‌గా చూస్తుంటాం. అయితే ఇలా ఎందుకు ప్రయాణించాల్సి వస్తుందంటే ఇందుకు చాలా కారణాలున్నాయి. ఒకటి సమయం, మరొకటి అది మిస్ అయితే.. అనే ప్రశ్నతో ఇలా చేస్తుంటారు ప్రయాణికులు.

విమానంలో నిలబడి ప్రయాణిస్తున్నారా?

ఈ ప్రశ్నకు సమాధానం లేదు అని మీరు భావిస్తే , గాలిలో వేగంగా ఎగురుతున్న విమానంలో నిలబడి ప్రయాణించడం అసాధ్యం.. నిలబడి ప్రయాణించడం వల్ల విమానం బ్యాలెన్స్ దెబ్బ తింటుందని చాలా మంది అంటారు. ప్రమాదం జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని 100 శాతం మంది వాధిస్తారు. ఇలాంటి ప్రశ్నకు పెద్ద జవాబు ఏంటంటే.. మీరు “ఆపరేషన్ సోలమన్” కథను తెలుసుకోవాలి. ఈ కథనం ఈ వాస్తవాలు, తర్కం తప్పు అని రుజువు చేస్తుంది. తెలిస్తే బహుశా మీరు ఆశ్చర్యపోతారు. కానీ ఆపరేషన్ సోలమన్‌లో 14,325 మంది పౌరులు 36 గంటల్లో విమానంలో నిలబడి ప్రయాణించారు.

ఆపరేషన్ సోలమన్ కథ ఏంటో తెలుసా..

ఆపరేషన్ సోలమన్ 24 మే 1991న ప్రారంభమై 25 మే 1991 వరకు కొనసాగింది. ఈ ఆపరేషన్‌ను ఇజ్రాయెల్ వైమానిక దళం నిర్వహించింది. ఆపరేషన్ సోలమన్ సమయంలో అల్ అల్ బోయింగ్ 747 36 గంటల్లో 14,325 ఇథియోపియన్ యూదులను ఇజ్రాయెల్‌కు తరలించింది. ఆపరేషన్ సమయంలో “ఆపరేషన్ సోలమన్” విమానం నాన్‌స్టాప్‌గా 36 గంటలపాటు ప్రయాణించింది.

అయితే, నాన్‌స్టాప్‌గా జరిగిన ఈ ప్రయాణంలో ఓ బిడ్డకు తల్లి జన్మనిచ్చింది. ఆపరేషన్ సోలమన్ సమయంలో విమానంలోని సీట్లన్నీ తొలగించారు. ప్రయాణీకులు బస్సు లేదా రైలులో కిక్కిరిసి ఉన్నట్లుగానే బోయింగ్ 747 విమానంలో ప్రయాణికులు నిండిపోయింది. ఆసక్తికరంగా, ఈ విమానం ప్రయాణ సమయంలో 1,086 మంది ప్రయాణికులు ఎక్కారు. దిగుతున్నప్పుడు మాత్రం 1,088 మంది ప్రయాణికులు దిగారు. ఎందుకంటే ప్రయాణంలో ఇద్దరు పిల్లలు జన్మించారు.

అనే ప్రశ్నకు సమాధానం విమానంలో నిలబడి ప్రయాణించడానికి సంబంధించిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే అది నిలబడి ప్రయాణించవచ్చు. ఏదైనా విమానంలో మీరు బస్సు లేదా రైలు లాగా నిలబడి ప్రయాణించవచ్చు. ఎటువంటి సమస్య ఉండదు. ప్రమాదం కూడా ఉండదు. అయితే, ఎయిర్ హోస్టెస్ ట్రాలీని తీసుకొని మీ కోసం క్యాటరింగ్ వస్తువులను తీసుకురావడానికి మాత్రం అస్సలు వీలు కాదు ఎందుకంటే రద్దీలో ట్రాలీ తిరగదు కాబట్టి.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం