Abroad Trains: ఈ రైలులో ప్రయాణిస్తూ విదేశాలను చుట్టేయెచ్చు.. మీరు రెడీనా.. ఫుల్ డీటెయిల్స్ ఇవే..

|

Feb 27, 2023 | 6:34 PM

మీరు విదేశాలకు వెళ్లాలనుకుంటే భారత్ నుంచి ఇతర దేశాలకు వెళ్లే కొన్ని రైళ్లు ఉన్నాయి. అవేంటో ఇక్కడ మనం తెలుసుకుందాం..

Abroad Trains: ఈ రైలులో ప్రయాణిస్తూ విదేశాలను చుట్టేయెచ్చు.. మీరు రెడీనా.. ఫుల్ డీటెయిల్స్ ఇవే..
Trains
Follow us on

విదేశాల్లో ప్రయాణించాలనే కోరిక మీకు ఉంటే విమానాల్లో ఎగిరిపోవల్సిన  అవసరం లేదు. మన భారతీయ రైళ్ల ప్రయాణించి విదేశాలను చుట్టి రావచ్చు. ఇలా విదేశాలకు ప్రయాణించే భారతీయ రైల్వేలు చాలా ఉన్నాయి. ఈ రైళ్లన్నీ వివిధ దేశాలకు మన దేశం నుంచి నడపబడుతున్నాయి. ఇటీవల కొన్ని రైళ్లను తిరిగి ప్రారంభించారు. అటువంటి కొన్ని రైళ్ల గురించి మనం తెలుసుకోవచ్చు. దీని సహాయంతో మీరు ఇతర దేశాలకు కూడా వెళ్లవచ్చు.

మీరు కూడా రైలులో విదేశాలకు వెళ్లాలనుకుంటే.. మీరు తప్పనిసరిగా పాస్‌పోర్ట్, ప్రయాణ అనుమతిని కలిగి ఉండాలి. దీనితో పాటు మీరు ప్రయాణించాలనుకునే రైలుకు కూడా టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. విదేశాలకు వెళ్లే రైళ్లు ఏవో ఇక్కడ మనం తెలుసుకుందాం.

బంధన్ ఎక్స్‌ప్రెస్ రైలు

బంధన్ ఎక్స్‌ప్రెస్ 2017లో ప్రారంభించబడింది. ఇది భారత్ – బంగ్లాదేశ్ మధ్య నడుస్తుంది. దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది కోల్‌కతా నుంచి బంగ్లాదేశ్‌లోని ఖుల్నా వరకు నడుస్తుంది.

మైత్రి ఎక్స్‌ప్రెస్

ఈ రైలు 2008లో ప్రారంభించబడింది. ఈ రైలు భారత్‌లోని కోల్‌కతా నుంచి ఢాకా వరకు నడుస్తుంది. ఈ రైలు 375 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ రైలులో ప్రయాణించే ప్రయాణికులు తప్పనిసరిగా వీసా కలిగి ఉండాలి. మైత్రీ ఎక్స్‌ప్రెస్ రెండు ప్రధాన నదుల గుండా వెళుతుంది. పద్మ నదిపై 100 ఏళ్ల నాటి హార్డింజ్ వంతెన, జమున నదిపై బంగబంధు వంతెన మీదుగా ఈ మైత్రి ఎక్స్‌ప్రెస్ ప్రయాణిస్తుంది.

సంఝౌతా ఎక్స్‌ప్రెస్

భారత్‌ అట్టారీ సరిహద్దు నుంచి పాకిస్తాన్‌లోని లాహోర్ వరకు నడుస్తున్న ఈ రైలు ప్రస్తుతం నడపబడటంలేదు. ఇది కాకుండా మరొక రైలు థార్ ఎక్స్‌ప్రెస్ లింక్ భారత్‌లోని జోధ్‌పూర్ నుంచి పాకిస్తాన్‌లోని కరాచీకి నడిచేది. ఈ సేవ 41 సంవత్సరాల తర్వాత 2006లో పునరుద్ధరించబడింది. ఇది 2019లో నిలిపివేయబడింది.

మూడేళ్లుగా నిలిచిపోయిన రైళ్లు 

భారత్ – పాకిస్తాన్ మధ్య నడిచే ఈ రైలు సేవలు ప్రస్తుతానికి మూసివేయబడ్డాయి. ఎందుకంటే రెండు దేశాల మధ్య సంబంధాలు చెడిపోవాడంతో ఈ రైలు ఆగిపోయింది. దాదాపు 3.5 ఏళ్లుగా ఈ రైళ్లు నిలిచిపోయాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం