Good Habits: కొత్త సంవత్సరంలో ప్రతిరోజూ కొద్ది సేపు దీనికి కేటాయించండి..ఆహ్లాదభరిత క్షణాలు గ్యారెంటీ!

|

Jan 02, 2022 | 1:14 PM

పెరుగుతున్న సాంకేతికత .. ఇంటర్నెట్‌పై ఆధారపడటం వల్ల, మనం పుస్తకాలు రాయడం .. చదవడం రెండింటినీ మరచిపోయాము. ఏదైనా రాయాలని కలం పట్టుకుంటే చేతులు వణికిపోతాయి.

Good Habits: కొత్త సంవత్సరంలో ప్రతిరోజూ కొద్ది సేపు దీనికి కేటాయించండి..ఆహ్లాదభరిత క్షణాలు గ్యారెంటీ!
Good Habits
Follow us on

Good Habits: పెరుగుతున్న సాంకేతికత .. ఇంటర్నెట్‌పై ఆధారపడటం వల్ల, మనం పుస్తకాలు రాయడం .. చదవడం రెండింటినీ మరచిపోయాము. ఏదైనా రాయాలని కలం పట్టుకుంటే చేతులు వణికిపోతాయి. సొంత రాతలు చదవడం కష్టమయ్యేలా మన చేతిరాత తయారైపోయింది. ఇది చేదు నిజం. మనం మంచి అలవాట్లు .. జీవనశైలి గురించి చెప్పుకునేటప్పుడు తప్పనిసరిగా ప్రతిరోజూ రాయడం..చదివే అలవాటు గురించి కూడా చెప్పుకోవాలి. మీరు కూడా చదివే.. రాసే అలవాట్లను పక్కన పెట్టి ఉంటె.. కొత్త క్యాలెండర్ సంవత్సరంలో దాన్ని మళ్లీ ప్రత్యేకంగా స్వీకరించండి.

చిన్నగా ప్రారంభించండి..

ఏదైనా కొత్తదనాన్ని స్వీకరించడానికి లేదా మళ్లీ మళ్లీ ప్రారంభించే ప్రయత్నం చిన్నదిగా ఉండాలి. అంటే ఒకేసారి రెండు-మూడు పేజీలు రాయడం కంటే స్టేట్‌మెంట్ రాయడం లేదా పేరా రాయడం ప్రారంభించడం మంచిది. తరువాత దానిని క్రమంగా పెంచండి. కేవలం ప్రాక్టీస్ కోసం రాస్తే, ఒక పేరా సరిపోతుంది. అలాగే.. చదవడం కోసం.. పుస్తకంలోని ఒక విభాగంతో ప్రారంభించి ప్రతిరోజూ చదవండి. ఓపికతో చదవడం, రాయడం వల్ల క్రమంగా సామర్థ్యం పెరిగి అలవాటుగా మారుతుంది.

ప్రతి చిన్న విషయాన్ని రాసుకోండి

చేతిలో మొబైల్, కంప్యూటర్ ఉండడం వల్ల ప్రతి చిన్న విషయాన్ని అందులో డిజిటల్ గా రాయడం మొదలుపెట్టారు. కానీ, మీరు వాటిని డైరీలో లేదా కాగితంపై రాయడం మంచిది. షాపింగ్ లిస్ట్ తయారు చేస్తున్నట్లయితే, మొబైల్ నోట్స్‌కు బదులుగా కాగితంపై రాయండి. ఇంట్లో ఏ పెట్టెలో ఏ వస్తువు ఉంచారో డైరీలో రాయండి. మీకు అలవాటు ఉంటే లేదా ప్రత్యేక వంటకాలు లేదా కోట్‌లను సేకరించడానికి ఇష్టపడితే, కంప్యూటర్‌లో ఫోల్డర్‌ను తయారు చేయకుండా, డైరీలోనే రాయండి.

రోజువారీ చేయవలసిన జాబితా

డైరీ రాయడం అలవాటు చేసుకోండి. ప్రత్యేక డైరీని తయారు చేయండి. మీరు ప్రతిరోజూ పూర్తి చేయవలసిన పనులను డైరీలో వ్రాయండి. ఉదయం నిద్రలేచిన తర్వాత డైరీలో రోజంతా చేయాల్సిన పనులను రాసుకుని పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. ఇది కాకుండా, మీరు రోజంతా చేసిన వాటికి ప్రత్యేకంగా డైరీని తయారు చేయవచ్చు. అంటే రోజు పూర్తవడంతో ఏం చేశారో డైరీలో డైలీ యాక్టివిటీస్ రాసుకోండి. ఇది రాయడం అలవాటు చేస్తుంది.

వార్తాపత్రిక చదవడం తప్పనిసరి

ప్రతి ఇంట్లో వార్తాపత్రిక వస్తుం. కాబట్టి ప్రతిరోజూ ఉదయం చదవడం ద్వారా రోజు ప్రారంభించండి. దీనివల్ల చదివే అలవాటు పెరగడమే కాకుండా విజ్ఞానం కూడా పెరుగుతుంది. అదేవిధంగా, మీకు నచ్చిన పుస్తకాన్ని ఉదయం మాత్రమే చదవండి. మీరు ఉదయం బిజీగా ఉంటే, అప్పుడు వార్తాపత్రిక చదవండి .. రాత్రి పూట టీవీ చూసే సమయాన్ని తగ్గించి పుస్తకాన్ని ప్రత్యామ్నాయంగా చదవండి. ఉదాహరణకు, కథ కోసం ఒక పుస్తకాన్ని చదవవచ్చు, తర్వాత మీరు తదుపరి వ్యాసాన్ని చదవవచ్చు. అలాంటి అంశాలను ప్రత్యామ్నాయంగా చదవండి, తద్వారా ఆసక్తి అలాగే ఉంటుంది.

ఇవి కూడా చదవండి: Corona Vaccination: 15-18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. మొదటి రోజు ఎంతమంది నమోదు చేసుకున్నారో తెలుసా?

New Year Horoscope: కొత్త సంవత్సరంలో మీ ఆరోగ్య..ఆర్ధిక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలని ఉందా? మరెందుకాలస్యం..