Hangover: ఒకేసారి ఎత్తిపట్టి 60 బీర్లు తాగిన మందుబాబు.. 6 నెలలైనా తగ్గని కిక్కు!

|

Nov 23, 2023 | 8:15 AM

ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం అనే విషయం అందరికీ తెలిసిందే. అధిక మోతాదులో మద్యం సేవించడం వల్ల క్యాన్సర్, కాలేయ వ్యాధులు, పక్షవాతం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు తరచూ చెబుతుంటారు. అయినప్పటికీ, మద్యపానం చేసేవారు మాత్రం ఈ విషయాలను పెడచెవిన పెట్టి ఫూటుగా తాగేస్తుంటారు. డ్రింకింగ్‌ చేయడం మొదలుపెడితే బాటిళ్ల మీద బాటిల్‌ లాగించేస్తుంటారు. సాధారణంగా ఆల్కహాల్ తీసుకున్న తర్వాత హ్యాంగోవర్ రావడం సాధారణమే. అయితే అది కొన్ని గంటల్లోనే పోతుంది. మరి కొంతమందికి హ్యాంగోవర్ నుంచి..

Hangover: ఒకేసారి ఎత్తిపట్టి 60 బీర్లు తాగిన మందుబాబు.. 6 నెలలైనా తగ్గని కిక్కు!
World's Longest Hangover
Follow us on

స్కాట్లాండ్‌, నవంబర్‌ 23: ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం అనే విషయం అందరికీ తెలిసిందే. అధిక మోతాదులో మద్యం సేవించడం వల్ల క్యాన్సర్, కాలేయ వ్యాధులు, పక్షవాతం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు తరచూ చెబుతుంటారు. అయినప్పటికీ, మద్యపానం చేసేవారు మాత్రం ఈ విషయాలను పెడచెవిన పెట్టి ఫూటుగా తాగేస్తుంటారు. డ్రింకింగ్‌ చేయడం మొదలుపెడితే బాటిళ్ల మీద బాటిల్‌ లాగించేస్తుంటారు. సాధారణంగా ఆల్కహాల్ తీసుకున్న తర్వాత హ్యాంగోవర్ రావడం సాధారణమే. అయితే అది కొన్ని గంటల్లోనే పోతుంది. మరి కొంతమందికి హ్యాంగోవర్ నుంచి కోలుకోవడానికి 24 గంటల సమయం కూడా పడుతుంది. కానీ అలాంటి ఓ వ్యక్తికి మాత్రం హ్యాంగోవర్ దిగడానికి ఒకరోజు, రెండు రోజులు.. వారం రోజులుగా కూడా సరిపోలేదు. అదేంటీ అనికుంటున్నారా? అయితే మీరు ఈ వ్యక్తి గురించ తెలుసుకోవల్సిందే..

స్కాట్లాండ్‌కు చెందిన ‘ది లాన్సెట్’ అనే మ్యాగజైన్‌లో ఈ విచిత్ర సంఘటనను ప్రచురించడం జరిగింది. 37 ఏళ్ల వ్యక్తి ఏకధాటిగా 34 లీటర్ల బారు లాగించేశాడు. దొరికింది కదా అని ఏకబిగియన తాగేశాడు. అంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత రోజు నుంచి మనోడికి కష్టాలు ప్రారంభమయ్యాయి. గతంలో అతనికి ఒక్క అనారోగ్య సమస్య కూడా లేదు. ఎప్పుడూ చిన్న ట్యాబ్లెట్‌ కూడా వేసుకోలేదు. అయితే ఈ సంఘటన తర్వాత ఒక్కసారిగా రోగాలన్నీ దాడి చేశాయి. బద్ధకం, తలనొప్పి, అస్పష్టమైన కంటి చూపుతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లాడు. పరీక్షించిన వైద్యులు అతనికి సిటీ స్కాన్‌, ఉష్ణోగ్రత, రక్తపోటు అన్ని పరీక్షలు చేశారు. రిపోర్టులను పరిశీలించిన డాక్టర్లు ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు. సదరు వ్యక్తి 2-4 రోజులు కాదు, దాదాపు నెల రోజులుగా ఈ సమస్యలతో బాధపడుతున్నట్లు రిపోర్టులు వెల్లడించాయి.

ఆ వ్యక్తికి ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయో మొదట్లో డాక్టర్లకు కూడా అర్థంకాలేదు. సీటీ స్కాన్ చేయగా, ఫలితాలు చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. వ్యక్తి మెదడు చుట్టూ ఉన్న వింత ఒత్తిడిని వారు గమనించారు. రక్త పరీక్షలో అతను లూపస్ యాంటీకోగ్యులెంట్ సిండ్రోమ్ అనే అరుదైన ఆటో-ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నాడని తేలింది. అతని శరీరంలోని ప్రతిరోధకాలు ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేశాయి. అందువల్లనే ఈ వ్యాధి వచ్చినట్లు గుర్తించారు. అలాగే అతని కంటి నరాల్లో వాపు ఉండటం వల్ల అతని కంటి చూపు స్పష్టంగా లేనట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

28 లీటర్ల బీరు తాగి అవస్థలు..

వైద్యులు అతని జీవనశైలి గురించి ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. తాను 60 పింట్స్ అంటే దాదాపు 28 లీటర్ల బీరు తాగానని, ఆ తర్వాత హ్యాంగోవర్ తగ్గలేదని తెలిపాడు. వైద్యులు అతని రక్తాన్ని పరీక్షించగా అతని శరీరంలో లూపస్ యాంటీకోగ్యులెంట్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. చివరికి.. అధికంగా బీర్ తాగడం వల్లనే అతని హ్యాంగోవర్ సుమారు 4 వారాల వరకు తగ్గలేదని వైద్యులు నిర్ధారించారు. ఆ తర్వాత కూడా తలనొప్పి, అస్పష్టమైన కంటి చూపు ఆరు నెలల పాటు కొనసాగింది. అన్ని నెలల వైద్యం తర్వాత ఎట్టకేలకు కోలుకున్నాడు. దీంతో అతన్ని ‘లాంగ్‌గెస్ట్ హ్యాంగోవర్’ ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.