“Miss AI” Contest: ప్రపంచంలో మొదటిసారిగా.. మిస్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ బ్యూటీ భామల కాంటెస్ట్..!
మిస్ ఇండియా, మిస్ వరల్డ్ ,మిస్ యూనివర్స్ ఇలాంటి అందాల పోటీల గురించి అందరికీ తెలుసు. అప్పుడప్పుడు ఎక్కడో చోట మిస్టర్ ఇండియా లాంటి పోటీలు కూడా మనం విన్నాం చూశా.. కానీ ఇప్పుడు ఒక బ్యూటీ కాంటెస్ట్ జరుగబోతుంది. అన్ని పోటీల్లాగానే ఇక్కడ కూడా నైపుణ్యం ప్రతిభ హావభావాలు ఇలా కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని విజేతలు ఎవరు ఎంపిక చేస్తారు.
మిస్ ఇండియా, మిస్ వరల్డ్ ,మిస్ యూనివర్స్ ఇలాంటి అందాల పోటీల గురించి అందరికీ తెలుసు. అప్పుడప్పుడు ఎక్కడో చోట మిస్టర్ ఇండియా లాంటి పోటీలు కూడా మనం విన్నాం చూశా.. కానీ ఇప్పుడు ఒక బ్యూటీ కాంటెస్ట్ జరుగబోతుంది. అన్ని పోటీల్లాగానే ఇక్కడ కూడా నైపుణ్యం ప్రతిభ హావభావాలు ఇలా కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని విజేతలు ఎవరు ఎంపిక చేస్తారు. కానీ పోటీ మాత్రం మనుషుల మధ్య కాదండోయ్… ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న.. ఎక్కడ చూసిన వాటి గురించే మాట్లాడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేయబడ్డ భామల మధ్య అందాల పోటీ.
మిస్ ఏ ఐ.. అంటే మిస్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ బ్యూటీ కాంటెస్ట్ జరగబోతోంది.. ఎలా అంటారా? కంప్యూటర్ సృష్టించిన భామలు అందం పోటీలో పాల్గొననున్నాయి. నలుగురు సభ్యులతో కూడిన జడ్జిల్లా ప్యానెల్ ముందు టాలెంట్ ప్రదర్శన ఉండనుంది. ఈ పోటీకి సంబంధించి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే… జడ్జిలలో రెండు ఏఐ జడ్జిలు కూడా ఉన్నాయట.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడకంలో నైపుణ్యం, టాలెంట్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని విన్నర్ ఎవరో ఎంపిక చేస్తారు.
ఈ మిస్ ఏ ఐ పోటీలో గెలిచిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందమైన భామకి 15 లక్షల ప్రైజ్ మనీ సైతం లభించనుందట. నా ఫన్ వే సంస్థ ఈ పోటీ నిర్వహణకు ముందుకొచ్చింది. ఈ పోటీలో పాల్గొనాలంటే ఏఐ మహిళ ఫోటోలను పోటీ నిర్వాహకులకు పంపాల్సి ఉంటుంది. ఈ ప్రపంచాన్ని మరింత మెరుగ్గా మార్చడం అనే అంశంపై ఏ ఐ క్రియేటర్స్ ఏమనుకుంటున్నారో… ఏఐ గురించిన సాంకేతిక అంశాల వరకు ప్రశ్నలు ఏఐ భామలకు ఎదురుకానున్నాయి. ఈ పోటీకి వేలాది ఎంట్రీలు వస్తాయని భావిస్తున్నట్టు నిర్వాహకులు తెలుపుతున్నారు. అందులోంచి టాప్ టెన్ ఏఐ ఫోటోలను సెలెక్ట్ చేసి… చివరికి తాప్సి విన్నెర్స్ ని మెలో జరిగే ఆన్లైన్ అవార్డు ఫంక్షన్లో అనౌన్స్ చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. ఏప్రిల్ 21 నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని మే 10న విజేతలను అనౌన్స్ చేస్తామని నిర్వాహకులు తెలిపారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…