World First SMS: ప్రపంచంలో తొలి మెసేజ్ ఇదే! దానిని ఎవరు.. ఎవరికి పంపించారో తెలుసా?

|

May 09, 2023 | 4:59 PM

World First SMS: ఏదైనా సమాచారాన్ని ఇతరులకు తెలియజేయాలంటే.. ఫోన్ కాల్ చేయడమో, వాట్సాప్, టెక్ట్స్ మెసేజ్ చేయడమే చేస్తుంటాం. ఇప్పుడున్న సాంకేతితతో మెసేజ్ పంపడం చాలా ఈజీ అయిపోతుంది. అందుకే చాలా మంది కాల్స్ కంటే.. మెసేజ్‌లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

World First SMS: ప్రపంచంలో తొలి మెసేజ్ ఇదే! దానిని ఎవరు.. ఎవరికి పంపించారో తెలుసా?
First Sms
Follow us on

ఏదైనా సమాచారాన్ని ఇతరులకు తెలియజేయాలంటే.. ఫోన్ కాల్ చేయడమో, వాట్సాప్, టెక్ట్స్ మెసేజ్ చేయడమే చేస్తుంటాం. ఇప్పుడున్న సాంకేతితతో మెసేజ్ పంపడం చాలా ఈజీ అయిపోతుంది. అందుకే చాలా మంది కాల్స్ కంటే.. మెసేజ్‌లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వాట్సాప్, ఇన్‌స్టాగ్రమ్, స్నాప్‌చాట్, మొబైల్ టెక్ట్స్ మెసేజ్ ఇలా అనేక సాధానాల ద్వారా మెసేజ్‌లు పంపుకోవడానికి ఆస్కారం ఉంది. మరి మెసేజింగ్ యాప్స్‌ను ఇంతలా యూజ్ చేస్తున్న మనం.. తొలి మెసేజ్ ఏంటి? ఎవరు పంపారు? ఎలా పంపారు? అని ఎప్పుడైనా ఆలోచించారా? దానికి సంబంధించిన ఆలోచనైనా మీకు వచ్చిందా? ఇవాళ మనం ఆ తొలి మెసేజ్ ఏంటి? ఎవరు దానిని పంపారు? అనేది తెలుసుకుందాం..

31 సంవత్సరాల క్రితం.. 3 డిసెంబర్ 1992న తొలి ఎస్ఎంఎస్ పంపించడం జరిగింది. ‘మేరీ క్రిస్మస్’ అని ఆ మెసేజ్ పంపారు. 15 అక్షరాల ఈ ఎస్ఎంఎస్‌ని వొడాఫోన్ నెట్‌వర్క్ ద్వారా నీల్ పాప్‌వర్త్.. వొడాఫోన్ ఉద్యోగి రిచర్డ్ జార్విస్ కు పంపారు.

22 ఏళ్ల బ్రిటీష్ ప్రోగ్రామర్ నీల్ పాస్‌వర్త్ తన కంప్యూటర్ నుంచి మొదటి ఎస్ఎంఎస్‌ను పంపాడు. ఆ తరువాత నుంచి ఎస్ఎంఎస్ అనేక విధాలుగా అప్‌డేట్ అవుతూ వచ్చింది. 2017లో నీల్ పాప్‌వర్త్ ఎస్ఎంఎస్‌పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. 1992లో వచ్చిన ఈ టెక్ట్సింగ్ మెసేజ్ సిస్టమ్ ఇంత పాపులర్ అవుతుందని అస్సలు ఊహించలేదన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..