World Bicycle Day: పాతతరం వారికి బీపీలు, షుగర్లు ఎక్కువగా అంటకపోవడానికి కారణం సైకిలే!

పాతతరం వారికి బీపీలు, షుగర్లు ఎక్కువగా అంటకపోవడానికి కారణమేమిటంటే సైకిలే! ఎడ్ల బళ్లను, గుర్రపు టాంగాలను వదిలేస్తే మొదటిసారిగా రోడ్డెక్కిన ద్విచక్రవాహనం సైకిలే! తాతల కాలం నుంచి ఇప్పటి వరకు సైకిల్‌కు అదే క్రేజు! దానిపై అదే మోజు!

World Bicycle Day: పాతతరం వారికి బీపీలు, షుగర్లు ఎక్కువగా అంటకపోవడానికి కారణం సైకిలే!
World Bicycle Day
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jun 03, 2022 | 12:18 PM

మనకు ఊహొచ్చాక ఎక్కి తిరిగే వాహనం సైకిలే! సైకిల్‌తో మనకున్న అనుబంధమే వేరు! ఓ తరం ముందువారికైతే సైకిలే సర్వస్వం.. ఎంతదూరమైనా సైకిల్‌పై హాయిగా వెళ్లొచ్చేవారు! ఇప్పుడీ సైకిల్‌ సంగతులెందుకంటారా..? ఇవాళ ప్రపంచ సైకిల్‌ దినోత్సవం కాబట్టి. ప్రతి ఏడాది జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా ఈ రోజును జరుపుకుంటారు కాబట్టి. ఈ సైకిల్‌ దినోత్సవం రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ స్వచ్ఛంద సంస్థలు సైకిల్‌ ర్యాలీ నిర్వహిస్తూ సైకిల్‌ వాడకంలో వచ్చే ప్రయోజనాలు చెబుతాయి. సరే, ఈ సందర్భంగా గత స్మృతులను నెమరేసుకునే అవకాశం కూడా వచ్చింది. అప్పట్లో సైకిల్‌ ఎలా ఉండేదో తెలుసుకునేందుకు అమెరికాలో ఓ సైకిల్‌ మ్యూజియంను ఏర్పాటు చేశారు. అంచేత కొంచెం సైకిల్‌ ముచ్చట్లను, ఆ మ్యూజికం కథాకమామీషును తెలుసుకుందాం!

పాతతరం వారికి బీపీలు, షుగర్లు ఎక్కువగా అంటకపోవడానికి కారణమేమిటంటే సైకిలే! ఎడ్ల బళ్లను, గుర్రపు టాంగాలను వదిలేస్తే మొదటిసారిగా రోడ్డెక్కిన ద్విచక్రవాహనం సైకిలే! తాతల కాలం నుంచి ఇప్పటి వరకు సైకిల్‌కు అదే క్రేజు! దానిపై అదే మోజు! ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే మన పూర్వీకులు ఉపయోగించిన సైకిల్‌ దగ్గర నుంచి ఈ తరం వాడుతున్న సైకిల్‌ వరకు అన్నింటిని ఒక్క దగ్గర చూసే ఓ చోటుందని చెప్పడానికే! మొట్టమొదటగా సైకిల్‌ ఎలా ఉండేది..? సైకిళ్ల పరిణామక్రమంబెట్టిది..? రూపు రేఖలు ఏ విధంగా మారాయి..? ఇత్యాది విషయాలను తెలుసుకోడానికి సైకిల్‌ స్వర్గం చక్కగా ఉపయోగపడుతుంది.. సైకిల్‌ స్వర్గమంటే మరేం లేదు.. సైకిల్‌ మ్యూజియమే! అమెరికా పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌లో ఉందీ మ్యూజియం. ప్రపంచంలో ఉన్న అతి పెద్ద సైకిల్‌ ప్రదర్శనశాల ఇదే! పేరు సైకిల్‌ హెవెన్‌! అచ్చ తెలుగులో సైకిల్‌ స్వర్గం. పేరుకు తగ్గట్టుగానే అదో సైకిల్‌ స్వర్గం! మ్యూజియంలోపలికి వెళితే ఎక్కడ చూసినా సైకిళ్లే కనిపిస్తాయి. గోడలు, పైకప్పులు సమస్తం సైకిళ్లే దర్శనమిస్తాయి. మూడు వేలకు పైగా సైకిళ్లను చాలా పొందికగా పెట్టారిక్కడ! మొదట మనమేదో సైకిల్‌ షాపుకు వచ్చామన్న ఫీలింగ్‌ కలుగుతుంది. ఆ తర్వాత సైకిళ్ల గొప్పతనమేమిటో అర్థమవుతుంది! కాలానికి అనుగుణంగా మారిన సైకిళ్ల నిర్మాణంపై అవగాహన వస్తుంది..

పాతకాలపు సైకిళ్లతో పాటు లేటెస్ట్‌గా తయారు చేసిన సైకిళ్లను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. పరిమాణంలో వచ్చిన వ్యత్యాసాలను కూడా గమనించవచ్చు.. చూడముచ్చటగొలిపే సైకిళ్లు ఓ పట్టాన మ్యూజియం నుంచి బయటకు రానివ్వవు. రకరకాల రంగులలో దర్పంగా నిలుచుకున్న సైకిళ్లను చూసి మనసు పారేసుకోకుండా ఉండలేం. క్రెయిగ్‌ మోరో అనే ఆయన కృషి ఫలితమే ఈ మ్యూజియం! మూడు దశాబ్దాలుగా సైకిళ్లను సేకరిస్తూ వస్తున్నారాయన! అలా సేకరించినవాటితోనే పదేళ్ల కిందట ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు.. దానికి చక్కగా సైకిల్‌ హెవెన్‌ అని పేరు పెట్టారు. ఇప్పుడీ మ్యూజియంను చూసేందుకు పర్యాటకులు క్యూలు కడుతున్నారు.

ఈ దృశ్యాలు చూస్తే.. మంచు కురిసే వేళలో అంటూ.. వీడియో వైరల్.
ఈ దృశ్యాలు చూస్తే.. మంచు కురిసే వేళలో అంటూ.. వీడియో వైరల్.
వాహ్‌! ఐస్ టీ.. మంచును కరిగించి టీ కాచిన పర్యాటకులు.. వీడియో.
వాహ్‌! ఐస్ టీ.. మంచును కరిగించి టీ కాచిన పర్యాటకులు.. వీడియో.
పుష్ప2 ఇక అవనట్టే! | ఒకే వీడియోలో ఇద్దరూ ఏడ్చేసిన సమంత.
పుష్ప2 ఇక అవనట్టే! | ఒకే వీడియోలో ఇద్దరూ ఏడ్చేసిన సమంత.
ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి.. శ్రీశైలానికి శివాజీకి ఏంటి సంబంధం?
ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి.. శ్రీశైలానికి శివాజీకి ఏంటి సంబంధం?
పొదుపా.. పెట్టుబడా.. రెండింటి మధ్య తేడా ఏమిటి?
పొదుపా.. పెట్టుబడా.. రెండింటి మధ్య తేడా ఏమిటి?
అయ్యో.! 'ఆడపిల్ల' అనుకునే వాళ్లకు.. ఈ తండ్రి కథే ఓ స్ఫూర్తి.!
అయ్యో.! 'ఆడపిల్ల' అనుకునే వాళ్లకు.. ఈ తండ్రి కథే ఓ స్ఫూర్తి.!
బిజినెస్‌ కోసం డబ్బు కావాలా? ఎన్‌పీఎస్‌ విత్‌డ్రాలో రూల్స్ మార్పు
బిజినెస్‌ కోసం డబ్బు కావాలా? ఎన్‌పీఎస్‌ విత్‌డ్రాలో రూల్స్ మార్పు
మరో రెండు వారాల్లో చెల్లెలి పెళ్లి.! ఇంతలోనే ఉహించుకొని షాక్.!
మరో రెండు వారాల్లో చెల్లెలి పెళ్లి.! ఇంతలోనే ఉహించుకొని షాక్.!
బైక్‌పై వెళ్తున్న యువకునికి గుండెపోటు! 26 ఏళ్లకే నూరేళ్లూ నిండాయి
బైక్‌పై వెళ్తున్న యువకునికి గుండెపోటు! 26 ఏళ్లకే నూరేళ్లూ నిండాయి
వన్‌ప్లస్ 12ఆర్ కొన్నవారికి డబ్బులు వెనక్కి.. ఎందుకంటే.?
వన్‌ప్లస్ 12ఆర్ కొన్నవారికి డబ్బులు వెనక్కి.. ఎందుకంటే.?