Rakhi to Jawan Statue: అమర జవాన్ విగ్రహానికి రాఖీతో నివాళి.. గొప్ప మనసు చాటుకున్న మహిళలు

| Edited By: Balaraju Goud

Aug 20, 2024 | 12:19 PM

సోదరులు, సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండుగంటే జరుపుకుంటాం. సాధారణంగా తమ సోదరులకు సోదరీమణులకు రాఖీలు కట్టి వేడుక చేసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం మహిళలు రాజకీయ నేతలకు రాఖీ కట్టినట్లుగా కాకుండా.. ఒక వీర జవాన్ కు రాఖీ కట్టి రాఖీ పండుగను జరుపుకుంటారు.

Rakhi to Jawan Statue: అమర జవాన్ విగ్రహానికి రాఖీతో నివాళి.. గొప్ప మనసు చాటుకున్న మహిళలు
Rakhi To Jawan Statue
Follow us on

సోదరులు, సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండుగంటే జరుపుకుంటాం. సాధారణంగా తమ సోదరులకు సోదరీమణులకు రాఖీలు కట్టి వేడుక చేసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం మహిళలు రాజకీయ నేతలకు రాఖీ కట్టినట్లుగా కాకుండా.. ఒక వీర జవాన్ కు రాఖీ కట్టి రాఖీ పండుగను జరుపుకుంటారు.

నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కోణతలపల్లికి చెందిన మిట్ట సత్తిరెడ్డి, మణెమ్మ దంపతుల కుమారుడు మిట్ట శ్రీనివాస్ రెడ్డి భారత సైన్యంలో చేరారు. దేశంలోని వివిధ సరిహద్దు ప్రాంతాల్లో లాన్స్ నాయక్ గా విధులు నిర్వర్తించాడు. పాకిస్తాన్ తో జరిగిన కార్గిల్ యుద్ధంలో శ్రీనివాస్ రెడ్డి వీరోచితంగా పోరాడాడు. 1999 జులై 17న ఆపరేషన్ కార్గిల్ లో శ్రీనివాస్ రెడ్డి వీరమరణం పొందాడు. తమ కుమారుడి జ్ఞాపకార్థం ఆయన తల్లిదండ్రులు గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శ్రీనివాస్ రెడ్డి సోదరి సరిత ప్రతి ఏటా రాఖీ పండుగ రోజు శ్రీనివాస్ రెడ్డి విగ్రహానికి రాఖీ కడుతున్నారు. ఈసారి కూడా శ్రీనివాస్ రెడ్డి సోదరితో గ్రామంలోని మహిళలందరూ వీర జావాన్ శ్రీనివాస్ రెడ్డిని సోదరుడిగా భావించి ఆయన విగ్రహానికి రాఖీ కట్టారు. దేశం కోసం తన సోదరుడు చేసిన ప్రాణ త్యాగం మరువలేనిదని శ్రీనివాస్ రెడ్డి సోదరి సరిత భావోద్వేగానికి గురయ్యారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..