Breast Milk: 10 నెలల కాలంలో 55 లీటర్ల చనుబాలు దానం.. అమ్మా నీకు వందనం…

పలు కారణాల వల్ల అందరు తల్లుల వద్ద పాలు ఉండకపోవచ్చు. దీంతో వారు పోతపాలే పిల్లలకు పడతారు. నిజంగా చెప్పాలంటే అమ్మపాలు తాగిన పిల్లలు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు.

Breast Milk: 10 నెలల కాలంలో 55 లీటర్ల చనుబాలు దానం.. అమ్మా నీకు వందనం...
Breast milk donor sindhu monica

Updated on: Nov 09, 2022 | 12:12 PM

అమ్మపాలలో మాధుర్యం ఉంటుంది.. మమకారం ఉంటుంది. అంతేకాదు బిడ్డకు కావాల్సిన అన్ని ప్రొటీన్లు, రోగనిరోధక శక్తి అందుతాయి. అందుకే అమ్మ పాలను తాగిన బిడ్డలకు, పోత పాలు తాగి పెరిగిన పిల్లలకు వ్యత్యాసం ఉంటుంది. కానీ అందరు తల్లులూ పిల్లలకు పాలివ్వగలిగే స్థితిలో ఉండకపోవచ్చు. అయితే పాలను దానమివ్వడానికి సిద్ధపడే గొప్ప తల్లుల మన సమాజంలో నానాటికి పెరుగుతున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడులో నివశించే ఓ మహిళ.. చనుబాలను దానం చేసే విషయంలో రికార్డు క్రియేట్ చేసింది. కేవలం 10 నెలల వ్యవధిలో 55 లీటర్స్ చనుబాలను.. సమీకరించి.. ఆపై డొనేట్ చేసి.. రోల్ మోడల్‌గా నిలిచింది. చేసిన గొప్ప పని కారణంగా ఆమె పేరు ‘ఆసియా అండ్‌ ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోకి ఎక్కింది. వివరాల్లోకి వెళ్తే..  కోయంబత్తూరు జిల్లా కన్యూర్‌ ప్రాంతంలో నివశించే ప్రొఫెసర్‌ మహేశ్వర్‌, సింధు మోనికకు 6 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయ్యింది. ఈ దంపతులకు వెంబా అనే ఏడాదిన్నర తనయ ఉంది. చనుబాలు డొనేట్ చేయడం గురించి సోషల్ మీడియా ద్వారా సింధు మోనిక అవగాహన పెంచుకుంది. తాను కూడా  చనుబాలను డొనేట్ చేయాలని నిర్ణయించుకుంది.

ఈ క్రమంలో తల్లి పాల నిల్వ కోసం విశేషం కృషి చేస్తున్న ‘అమృతం థాయ్‌ పల్‌ దానం’ అనే సంస్థను సంప్రదించింది.  ఈ సంస్థ కార్యాలయం తిరుపూర్‌ జిల్లా అవినాసి ఏరియాలో ఉంది.  తరుచుగా అక్కడి వెళ్లి తల్లి పాలను ఎలా సేకరించాలి, ఎలా స్టోర్ చేయాలి.. పాడవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అనే విషయాలపై అవగాహన పెంచుకుంది. ఈ పద్దతులను పాటిస్తూ సింధు మోనిక గత 10 నెలల్లో 55 లీటర్ల చనుపాలను సేకరించి కోయంబత్తూరు గవర్నమెంట్ ఆస్పత్రికి అందించారు. ఆమె చేసింది నిజంగా గొప్పపని. ఆమె చేసిన కృషిని, సమాజ సేవకు ఆసియా, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స‌లో చోటు దక్కింది.

ప్రకృతిలో అమ్మ పాల స్థానాన్ని మరేవీ భర్తీ చేయలేవు. నిజంగా తమ పాలను దానం చేసే తల్లులు దేవతలే. తమ బిడ్డలే కాదు బయట పిల్లలు కూడా బాగుండాలని కోరుకునే మనసు ఎంతమందికి ఉంటుంది చెప్పండి. ఇలాంటి తల్లుల సంఖ్య మున్ముందు ఇంకా పెరగాలని కోరుకుంటూ.. గొప్ప పని చేసిన సింధు మోనికకు అభినందనలు తెలుపుదాం.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..