Shirt Side Buttons: అమ్మాయిల చొక్కాలకు ఎడమ వైపు, పురుషుల చొక్కాలకు కుడి వైపు బటన్లు ఎందుకు ఉంటాయో తెలుసా..

|

Jan 01, 2023 | 9:48 AM

అబ్బాయిల షర్టులకు రైట్ సైడ్ బటన్లు(గుండీలు) ఉంటాయి కానీ అమ్మాయిల షర్టులకు ఎడమ వైపున ఉంటాయి. అన్నీ ఒకేలా ఉన్న తర్వాత కూడా బటన్‌ల సైడ్‌లు ఎందుకు భిన్నంగా ఉంటాయన్నదే ప్రశ్న. ఇలా ఎందుకు ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం..

Shirt Side Buttons: అమ్మాయిల చొక్కాలకు ఎడమ వైపు, పురుషుల చొక్కాలకు కుడి వైపు బటన్లు ఎందుకు ఉంటాయో తెలుసా..
Why Men And Women Shirts Button Up On Different Sides
Follow us on

స్త్రీలు, పురుషుల దుస్తులు చాలా భిన్నంగా ఉంటాయి. అయితే, కాలం మారింది.. ఇప్పుడు ఇద్దరూ వేసుకునే కొన్ని బట్టలు ఓకేలా ఉంటున్నాయి. ఇందులో షర్ట్, టీ-షర్ట్, జీన్స్ ఇలా కొన్ని ఒకేలా వేస్తున్నారు. అయితే, కొన్ని బట్టలు చూడటానికి ఒకేలా ఉన్న తేడా ఓ పెద్ద తేడా మాత్రం ఇందులో కనిపిస్తుంది. అది అబ్బాయిలు లేదా అమ్మాయిలు కావచ్చు.. ఇప్పుడు వారు అలాంటి దుస్తులను ధరించడం ప్రారంభించారు. అలాంటప్పుడు జీన్స్, టీ షర్టులు, షర్టులు ఏదైనా సరే.. అబ్బాయిలు, అమ్మాయిల ఫ్యాషన్‌లో పెద్దగా తేడా ఉండదు. అయితే, చాలా కాలంగా అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరూ ధరించే దుస్తులలో చొక్కా ఒక భాగం. ఇద్దరి షర్టులు కూడా ఒకేలా ఉంటాయి, కానీ ఇప్పటికీ చిన్న వ్యత్యాసం అబ్బాయిలు, అమ్మాయిల షర్టుల మధ్య వ్యత్యాసాన్ని సృష్టిస్తుంది. అది బటన్ వైపు ఉంటుంది. వాస్తవానికి, అబ్బాయిల చొక్కాలకు కుడి వైపున బటన్లు ఉంటాయి. కానీ అమ్మాయిల షర్టులు ఎడమ వైపున ఉంటాయి.

ఇప్పుడు అసలు ప్రశ్న ఇక్కడే ఉంది. ప్రతిదీ ఒకేలా ఉన్న తర్వాత కూడా.. బటన్లను వేరు వేరుగా  ఎందుకు ఉంటాయి. మహిళల చొక్కాల బటన్లు ఎడమ వైపున ఉండేందుకు అనేక కారణాలున్నాయి. ఫ్యాషన్ రంగానికి చెందిన డిజైనర్లు అందించిన సమాచారం ప్రకారం. తల్లి పాలివ్వడంలో మహిళలు తరచుగా పిల్లలను ఎడమ వైపు ఉంచడం కూడా ఓ కారణం కావచ్చు. ఎడమ వైపున ఉన్న బటన్‌ను తెరవడం, మూసివేయడం వారికి ఈజీగా ఉంటుంది.

దీనికి శతాబ్దాల చరిత్ర..

అదే సమయంలో, దీనికి 13వ శతాబ్దంతో కూడా సంబంధం ఉంది. నిజానికి ఇది చాలా తక్కువ మంది మాత్రమే చొక్కాలు వేసుకునే కాలం. ఎందుకంటే ఆ సమయంలో చొక్కా కొనడం పెద్ద విషయం. చాలా మంది శరీరాన్ని కప్పి ఉంచే బట్టలు మాత్రమే కట్టుకుని పని చేసేవారు. మరోవైపు, చొక్కాలు ధరించే మహిళలు పెద్ద ఇళ్ళు, రాజ ప్రస్థానంకు చెందిన కుటుంబాలవారు ఉండేవారు. వారి వెంట దాసీలు ఉండేవారు. చొక్కాలు ధరించిన మహిళలు ఎడమ వైపు బటన్‌ను మూసివేయడం.. వారి దాసీలకు చాలా ఈజీ.. కాబట్టి ఎడమ వైపు బటన్‌ను కుట్టడం మొదలు పెట్టారు. ఇది అప్పటి నుంచి ఇప్పటివరకు కొనసాగుతోంది. అదే సమయంలో పురుషులు స్వయంగా బట్టలు వేసుకునేవారు. అందువల్ల వారు బటన్లను పెట్టుకునేవారు.  దీంతో రైట్ హ్యాండ్‌తో బటన్లను పెట్టుకోవడం వారికి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. కాబట్టి పురుషుల చొక్కాలు బటన్లను కుడి వైపుకు ఉండటం ప్రారంభించాయి.

యుద్ధంలో పాల్గొన్న పురుషులు

ఎక్కువగా పురుషులు యుద్ధంలో పాల్గొనడానికి ఉపయోగించే బటన్ వైపుకు సంబంధించిన వాదన కూడా ఉంది. వారు ఎడమ వైపున ఆయుధాలను ఉంచేవారు. అందుకే ఆయుధం తీయడంలో ఇబ్బంది కలగని విధంగా వారి దుస్తులను డిజైన్ చేశారు. వారు ఎడమ చేతితో బటన్లను సులభంగా తీగలరు. అందుకే వారి బట్టలు కుడి వైపున బటన్లకు కుట్టారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం