బంగారానికి తుప్పు ఎందుకు పట్టదు.. దీని వెనుక అసలు కారణం ఏంటో తెలుసా..?

|

Oct 23, 2024 | 1:34 PM

బంగారం ధరించడం ప్రతి స్త్రీ కల. మనదేశంలో అత్యధికంగా బంగారం కొనుగోలు చేసి ధరిస్తారు. మన దేశంలో ప్రాచీన కాలం నుండి బంగారాన్ని ఉపయోగిస్తున్నారు. దీని ఖచ్చితత్వం క్యారెట్‌లో కొలుస్తారు. బంగారాన్ని ఆభరణాలు, నాణేలు మొదలైన వాటి రూపంలో ఉపయోగిస్తారు. అయితే, బంగారం ఇతర లోహాల మాదిరిగా ఎందుకు తుప్పు పట్టదని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..?

బంగారానికి తుప్పు ఎందుకు పట్టదు.. దీని వెనుక అసలు కారణం ఏంటో తెలుసా..?
Gold
Follow us on

బంగారం ఒక ఘనమైన, విలువైన మెరిసే పసుపు రంగు లోహం. ఇందులోని అనేక లక్షణాల కారణంగా ఇది విలువైనది. పురాతన కాలం నుండి దీనిని నాణేలు, ఆభరణాలు మొదలైన వాటి తయారీకి ఉపయోగిస్తున్నారు. బంగారం, రాగి మొదట కనుగొన్న లోహాలు. బంగారం రసాయనికంగా inert, అంటే అది ఆక్సిజన్, తేమతో చర్య జరపదు. ఇనుము వంటి ఇతర లోహాలు ఆక్సీకరణం చెందుతాయి, దీనివల్ల వాటికి తుప్పు పడుతుంది.

బంగారానికి తుప్పు పట్టదు ఎందుకంటే అది noble metal. అంటే బంగారం రసాయనికంగా చాలా స్థిరంగా ఉంటుంది. గాలి, నీరు లేదా ఇతర రసాయనాల దగ్గరకు వచ్చినా అంత తేలికగా చర్య జరపదు. సాధారంగా లోహాలు ఆక్సిజన్‌తో చర్య జరిపినప్పుడు ఆక్సైడ్ పొర ఏర్పడుతుంది. దీనివల్ల తుప్పు పడుతుంది. కానీ, బంగారం ఆక్సిజన్‌తో చర్య జరపదు. కాబట్టి ఆక్సైడ్ పొర ఏర్పడదు. దీనివల్ల బంగారం తుప్పు పట్టకుండా ఉంటుంది. బంగారం దాని అధిక తుప్పు నిరోధకతకు ప్రసిద్ధి చెందింది. దీనికి ఆమ్లాలు, క్షారాలు లేదా ఇతర రసాయనాల వల్ల హాని జరగదు. ఇవి ఇతర లోహాలలో తుప్పుకు కారణమవుతాయి.

బంగారం పరమాణు నిర్మాణం కూడా దానిని రసాయన చర్య నుండి దూరంగా ఉంచుతుంది. దాని ఎలక్ట్రాన్లు చాలా బలంగా బంధించబడి ఉంటాయి. అవి ఇతర మూలకాలతో సులభంగా చర్య జరపవు. పుత్తడిలోని ఈ లక్షణాల కారణంగానే బంగారం దాని మెరుపు, రూపాన్ని చాలా కాలం పాటు నిలుపుకుంటుంది. దానికి ఎప్పుడూ తుప్పు పట్టదు. ఈ కారణంగానే బంగారాన్ని ఆభరణాలు, నాణేల తయారీలో ఉపయోగిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి