SIM Card: సిమ్ కార్డ్ ఒక మూలన ఎందుకు కట్ చేయబడిందో తెలుసా.. అసలు సంగతి ఇదే

Why Cut In SIM Card: SIM కార్డ్ ఒక మూల నుంచి ఎందుకు కత్తిరించబడి ఉంటుందో ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా...

SIM Card: సిమ్ కార్డ్ ఒక మూలన ఎందుకు కట్ చేయబడిందో తెలుసా.. అసలు సంగతి ఇదే
Sim Card Cut

Edited By: Ravi Kiran

Updated on: Aug 31, 2022 | 6:15 PM

మనం నిత్యం ఉపయోగించేవాటిలో సైన్స్ దాగివుంటుంది. కొన్నింటిలో ఉండే టెక్నాలజీని మనం అస్సలు పట్టించుకోము. ఎందుకు అలా ఉంది..? దానికి కారణం ఏంటి..? ఇలాంటి ప్రశ్నలు మన ఇంట్లో చిన్న పిల్లుల వేస్తుంటారు. కాని మనం కొంత వయసు వచ్చిన తర్వాత ఇలాంటి ప్రశ్నలు మనకు రావు. అయితే టెక్నాలజీకి సంబంధించినది ఏదైనా.. ప్రతిదానికీ కొన్ని ప్రత్యేక అర్థం ఉంటాయి. తరచుగా మన రోజువారీ పనిలో చాలా విషయాలు ఉన్నాయి. కానీ వాటి గురించి మనకు పెద్దగా తెలియదు. వాటిలో సిమ్ కార్డ్ కూడా ఒకటి. అది లేకుండా, మొబైల్ ఫోన్‌కు అర్థం చెప్పుకోలేం. సిమ్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మాత్రమే కాల్‌లు లేదా ఇతర చాలా పనులు మొబైల్ నుంచి చేయవచ్చు. అయితే ఒక మూల నుంచి సిమ్ కార్డ్ ఎందుకు కట్ చేయబడిందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? మా ఈ కథనం ద్వారా మీకు దాని గురించి పూర్తి సమాచారం దొరుకుతుంది..

అందుకే సిమ్ కార్డ్ ఒక మూలన కట్..

తొలి సిమ్‌కార్డులు తయారైనప్పుడు.. ప్రస్తుత సిమ్‌కార్డుల మాదిరి మూలన కోత ఉండేది కాదు. మొబైల్ యూజర్లు సిమ్‌ను ఇన్‌స్టాల్ చేయడంలో ఇబ్బంది పడేవారు. ప్రతిసారి సిమ్‌ను రివర్స్‌లో పెట్టేవారు. ఇలా చాలా సార్లు జరుగుతుండటం.. ఇలా జరిగిన ప్రతి సారి.. బయటకు తీసి.. తిప్పి వేసుకోవడం ఇబ్బందిగా మారింది. సిమ్‌ను ఇన్‌స్టాల్ చేయడంలో పడుతున్న ఇబ్బందులను పరిశీలించిన టెలికాం కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఒకే సారి సరిగ్గా ఇన్‌స్టాల్ అయ్యేలా సిమ్ కార్డ్‌ను మూలన కత్తిరించడం మొదలు పెట్టాయి.

SIM కార్డ్ నిర్మాణంలో మార్పు..