
పురాతన కాలం నుండి ఉన్న బావులన్ని గుండ్రని ఆకారంలో నిర్మించబడ్డాయి. దీని వెనుక అనేక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని చిరిత్రకారులు చెబుతున్నారు. బావి గుండ్రని ఆకారంలో తవ్వడానికి మొదటి కారణం గుండ్రని బావిలోని నీటి పీడనం అన్ని వైపులా సమానంగా పంపిణీ చేయబడుతుంది. అలా కాకుండా బావిని చతురస్రం లేదా త్రిభుజం ఆకారంలో నిర్మిస్తే, నీటి పీడనం అంతా మూలలపై పడిపోతుంది, ఇది దానిని బలహీనపరుస్తుంది. దీని వల్ల బావి గొడలు విరిగిపోయే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఆలా నిర్మించడం వల్ల బావుల జీవితకాలం కూడా తగ్గుతుంది. కానీ గుండ్రని బావిలో అన్నివైపుల నుంచి సమాన ఒత్తిడి ఉంటుంది, దీని కారణంగా బావి ఎక్కువ ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని పొందుతుంది. అలాగే బావి కూలిపోయే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి.
బావులు గుండ్రంగా నిర్మించడానికి మరొక కారణం ఏమిటంటే, బావిని నిర్మించినప్పుడు, ఒక గుంత తవ్వుతారు. అలాంటప్పుడు వృత్తాకారంలో గుంత తవ్వడం చాలా సులభం. కానీ చతురస్రాకారంలో లేదా త్రిభుజాకారంలో గుంత తవ్వడం చాలా కష్టం. అలాగే, వృత్తాకార బావిని తవ్వడానికి ఎక్కువ శ్రమ అవసరం ఉండదు. కాబట్టి బావులను గుండ్రని ఆకారంలో ఎక్కువగా తవ్వుతారు.
ముఖ్యంగా, ఇతర రకాల బావులతో పోలిస్తే, గుండ్రని బావులు ఎక్కువ నీటిని ఉత్పత్తి చేస్తాయి. అంతేకాకుండా, వృత్తాకార బావిని సులభంగా శుభ్రం చేయవచ్చు. బావి త్రిభుజాకారంగా లేదా చతురస్రాకారంగా ఉంటే, దానిలో మురికి పేరుకుపోతుంది. ఇది నీటి కాలుష్యానికి దారితీస్తుంది. మరొక విషయం ఏమిటంటే, బావి వృత్తాకారంగా ఉన్నప్పుడు, నీటి ప్రవాహం అంతరాయం లేకుండా ఉంటుంది. ఈ శాస్త్రీయ, ఆచరణాత్మక కారణాల వల్ల, బావిని వృత్తాకార ఆకారంలో నిర్మిస్తారు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.