Facts About Medicines: ఏ ట్యాబ్లెట్స్‌ని విరిచి వేసుకోకూడదు.. తప్పక తెలుసుకోవాల్సిన వివరాలు..

వాటిని వేసుకుంటే.. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే, కొన్ని సందర్భాల్లో మెడిసిన్స్‌ను విరిచి, సగం సగం వేసుకుంటారు. సగం వేసుకోవడం వలన.. ఆ డోస్ వారికి సరిపోతుందని భావిస్తారు. చాలా మంది ఇలాగే చేస్తారు. మరి నిజంగా ట్యాబ్లెట్ హాఫ్ చేయడం, సగం వరకు విరవడం సరైనదేనా? సగం విరిచి వేసుకోవడం ప్రయోజనకరమా? హానీకరమా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు?

Facts About Medicines: ఏ ట్యాబ్లెట్స్‌ని విరిచి వేసుకోకూడదు.. తప్పక తెలుసుకోవాల్సిన వివరాలు..
Medicine

Updated on: Aug 22, 2023 | 5:23 PM

ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే నేరుగా వైద్యుల వద్దకు వెళ్తారు. వ్యాధిని గుర్తించి.. అది తగ్గేందుకు అవసరమైన మందులను వైద్యులు ఇస్తారు. వాటిని వేసుకుంటే.. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే, కొన్ని సందర్భాల్లో మెడిసిన్స్‌ను విరిచి, సగం సగం వేసుకుంటారు. సగం వేసుకోవడం వలన.. ఆ డోస్ వారికి సరిపోతుందని భావిస్తారు. చాలా మంది ఇలాగే చేస్తారు. మరి నిజంగా ట్యాబ్లెట్ హాఫ్ చేయడం, సగం వరకు విరవడం సరైనదేనా? సగం విరిచి వేసుకోవడం ప్రయోజనకరమా? హానీకరమా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? కీలక వివరాలను ఈ వార్తలో తెలుసుకుందాం..

మందు విరిచి వేసుకోవచ్చా?

ఏమైనా ఔషధాన్ని విచ్ఛిన్నం చేసి వేసుకుంటున్నారా? అయితే, అలా చేయడానికి ముందు ఆ మందుపై రాసి ఉన్న సూచనలను తప్పకుండా చదవాలి. కొందరు ట్యాబ్లెట్‌ను విరిచి వేసుకుంటారు. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ ఆ మెడిసిన్‌పై రాసి ఉంటుంది. ఔషధం వెనుక ఈ విషయంలో రాసి లేకపోతే.. దాని గురించి వైద్యుడిని గానీ, మెడికల్ షాపులో కెమిస్ట్‌ను గానీ అడిగి తెలుసుకోవచ్చు. అయితే, మాత్రలు లేదా క్యాప్సుల్స్‌ విరిచి తినవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. ఇలా సగం వేసుకోవడం వలన అందులోని డోస్‌ను తగ్గిస్తుంది. దాంతో దాని ప్రభావం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఏ మందులు విచ్ఛిన్నం చేయొద్దు..

కొన్ని ట్యాబ్లెట్స్‌ వెనుక భాగంలో ఎస్ఆర్(sustain release), సిఆర్(control release), xr (extend release) అనే చిన్న రూపాన్ని కలిగి ఉంటాయి. అలాంటి మందులను నేరుగా మింగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ మందులను విచ్ఛిన్నం చేయకూడదు, నమలకూడదు అని దీని అర్థం. ఇటువంటి మాత్రలు శరీరంలో నెమ్మదిగా కరిగిపోతాయి. వీటి ప్రభావం ఎక్కువ కాలం ఉంటుంది.

ఏ మందులు విచ్ఛిన్నం చేసి తినొచ్చు..

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం అన్ని మెడిసిన్స్‌ని విచ్ఛిన్నం చేసి తినలేము. కొన్ని ట్యాబ్లెట్స్‌ మధ్యలో ఒక లైన్ గీయబడి ఉంటుంది. ఆ మాత్రలు విచ్ఛిన్నం చేసి తినవచ్చు. ఈ లైన్ గుర్తింపు ఏంటంటే.. దానిని విచ్ఛిన్నం చేసి తినవచ్చని. ఇలాంటి మాత్రలను స్కోర్ మాత్రలు అంటారు. మార్కెట్‌లో 1000 ఎంజీ ఔషధం అందుబాటులో ఉండి.. మీకు 500 ఎంజీ మాత్రమే అవసరం అయితే, దానిపై గీత ఉంటే.. దానిని విరిచి సగం మాత్ర వేసుకోవచ్చు. ఇదే విషయాన్ని వైద్యులు కూడా ముందే చెబుతారు. ఒకవేళ ఏమైనా సందేహాలుంటే.. వైద్యులను, మెడికల్ షాపులోని కెమిస్ట్‌ని అడిగి తెలుసుకోవడం ఉత్తమం.

గమనిక: పైన పేర్కొన్న వివరాలు వైద్యులు, కెమిస్ట్‌లు తెలిపిన సూచనల మేరకు, ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..