ప్రధాన మంత్రిగా ఉండి కూడా కారు కోసం లోన్ తీసుకున్న లాల్ బహదూర్ శాస్త్రి.. ఆ లోన్ తీర్చకుండానే మృతి.. ఆపై

|

Feb 10, 2021 | 8:46 PM

భారత ప్రధానుల్లో లాల్ బహదూర్ శాస్త్రిది భిన్నమైన శైలి. భారతదేశానికి రెండో ప్రధానిగా కొంతకాలమే పనిచేసినా ఆయన భారతీయ యవనికపై తనదైన ముద్ర వేశారు.. ఇక లాల్ బహదూర్ శాస్త్రి ఔన్నత్యం గురించి ఎన్ని సంఘటనలు గుర్తు చేసుకున్నా ఇంకొకటి ఉందేమో..

ప్రధాన మంత్రిగా ఉండి కూడా కారు కోసం లోన్ తీసుకున్న లాల్ బహదూర్ శాస్త్రి.. ఆ లోన్ తీర్చకుండానే మృతి.. ఆపై
Follow us on

Lal Bahadur Shastri : భారత ప్రధానుల్లో లాల్ బహదూర్ శాస్త్రిది భిన్నమైన శైలి. భారతదేశానికి రెండో ప్రధానిగా కొంతకాలమే పనిచేసినా ఆయన భారతీయ యవనికపై తనదైన ముద్ర వేశారు.. ఇక లాల్ బహదూర్ శాస్త్రి ఔన్నత్యం గురించి ఎన్ని సంఘటనలు గుర్తు చేసుకున్నా ఇంకొకటి ఉందేమో అనిపిస్తుంది అంతటి వ్యక్తిత్వం ఆయన సొంతం.. ఇక ఆయన వ్యక్తిత్వాన్ని ఔన్నత్యాన్ని గుర్తు చేసే ఒక సంఘటన ఈరోజు మళ్ళీ తెలుసుకుందాం..!

లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని మంత్రి పదవి చేపట్టిన తర్వాత కూడా సొంత ఇల్లు, కారు లేవు.. దీంతో తండ్రి దేశ ప్రధాని కనుక సొంత కారు, ఇల్లు కావాలని శాస్త్రి పిల్లలు కోరుకున్నారు.  పిల్లల కోరిక తీర్చడానికి లాల్ బహదూర్ శాస్త్రి కారు కొనాలనుకున్నారు. ఫియట్ కారు కొనాలనుకున్నారు. అప్పట్లో ఆ కారు ధర రూ . 12,000. తన బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బుందో చూడమని సెక్రెటరీకి చెప్పారు. మీ బ్యాంక్ ఖాతాలో రూ. 7వేల మాత్రమే ఉన్నాయని సెక్రటరీ చెప్పారు.

కారు కొనడానికి తండ్రి వద్ద డబ్బులేదని తెలిసిన తర్వాత పిల్లలు కారు వద్దని చెప్పారట.. అయినా బ్యాంక్ లోన్ తీసుకుని లాల్ బహదూర్ శాస్త్రి కారు కొన్నారు. అప్పట్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ. 5వేల  లోన్ తీసుకున్నారు. అయితే ఈ లోన్ తీర్చకుండానే లాల్ బహదూర్ శాస్త్రి మరణించారు.

అనంతరం ప్రధానిగా పదవి చేపట్టిన ఇందిరా గాంధీ ఆ లోన్ ను మాఫీ చేయించడానికి నిర్ణయించారు.. అయితే శాస్త్రి భార్య ఒప్పుకోలేదు.. తనకి వచ్చే ఫెన్షన్ తో నాలుగేళ్ళ పాటు ఆ బ్యాంక్ అప్పును తీర్చారు.. భర్త కు తగ్గ భార్య అనిపించుకున్నారు. ఇప్పటికీ ఆ కారు ఢిల్లీ లోని లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్ లో ప్రదర్శనకు ఉంది. దేశం నలుమూల నుంచి ఈ కారును ఆయన స్మృతులను చూడడానికి ప్రజలు వస్తారు. అయితే భారత మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి మరణించి 56 ఏళ్ళు అయినా ఇప్పటికీ ఆయన మృతిపై ముసురుకున్న అనుమానాలకు తెరపడలేదు.

Also Read:

అన్నదాతల ‘ఉగ్ర రూపం’, ఈ నెల 18 న దేశవ్యాప్తంగా 4 గంటలపాటు రైల్ రోకో ఆందోళన

కరోనావైరస్ సమయంలో గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్న జంటల సమస్యకు జింక్ అత్యుత్తమ పరిష్కారం