Alcohol: రోజులు గడిచేకొద్దీ విస్కీ టేస్ట్ పెరుగుతుంది.. బీర్‌లో ఇలా ఎందుకు జరగదో తెలుసా?

|

Sep 08, 2024 | 3:28 PM

అయితే ఒక్కో మద్యానికి ఒక్కో రకమైన లక్షణం ఉంటుంది. సాధారణంగా విస్కీకి ఎలాంటి గడువు తేదీ ఉండదు. నిజానికి ఎంత పాత విస్కీ అయితే దానికి అంత డిమాండ్ ఉంటుంది. ఇన్ని ఇయర్స్ ఓల్డ్‌ విస్కీ అంటూ ఎక్కువ ధరకు విక్రయిస్తుంటారు. ఒక్కో బాటిల్‌ రూ. లక్షలు కూడా పలుకుతుంటాయి. అయితే బీర్‌కు అలా ఉండదు...

Alcohol: రోజులు గడిచేకొద్దీ విస్కీ టేస్ట్ పెరుగుతుంది.. బీర్‌లో ఇలా ఎందుకు జరగదో తెలుసా?
Beer
Follow us on

ఆల్కహాల్‌.. ఆరోగ్యానికి మంచిది కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆల్కహాల్‌ బాటిల్‌పైనే ఈ విషయాన్ని స్పష్టంగా రాస్తుంటారు. అయినా మద్యం ప్రియులు మాత్రం ఈ అలవాటు మానుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఆల్కహాల్‌ను ఇష్టపడే వారు ఎంతో మంది ఉన్నారు. విస్కీ, బీర్‌, జిన్‌, రమ్‌ ఇలా ఆల్కహాల్‌లో ఎన్నో రకాలు ఉన్నాయి. రకం ఏదైనా మత్తును ఇవ్వడం మాత్రం సర్వసాధారణం.

అయితే ఒక్కో మద్యానికి ఒక్కో రకమైన లక్షణం ఉంటుంది. సాధారణంగా విస్కీకి ఎలాంటి గడువు తేదీ ఉండదు. నిజానికి ఎంత పాత విస్కీ అయితే దానికి అంత డిమాండ్ ఉంటుంది. ఇన్ని ఇయర్స్ ఓల్డ్‌ విస్కీ అంటూ ఎక్కువ ధరకు విక్రయిస్తుంటారు. ఒక్కో బాటిల్‌ రూ. లక్షలు కూడా పలుకుతుంటాయి. అయితే బీర్‌కు అలా ఉండదు. బీర్‌ను తయారు చేసిన తర్వాత 6 నెలలోపు తీసుకుకోవాలి. లేదంటే ఆరోగ్యంపై దుష్ప్రభావం ఏర్పడుతుంది. బీర్‌ బాటిల్స్‌పై అది తయారు చేసిన తేదీని ప్రింట్ చేస్తారు.

గడువు తీరిన బీర్ తాగితే ఫుడ్‌ పాయిజిన్ అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. మరి బీర్ పాతది అయితే ఎందుకు ఫుడ్‌ పాయిజిన్‌ అవుతుంది. విస్కీ ఎంత పాత పడితే అంత రుచి ఎలా వస్తుందో ఎప్పుడైనా అనుమానం వచ్చిందా. దీని వెనకాల ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. విస్కీ తయారీ విధానం, బీర్‌ తయారీ విధానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. విస్కీలో ఆల్కహాల్‌ శాతం ఎక్కువగా ఉంటుంది.

అయితే బీరులో మాత్రం కేవలం 6 నుంచి 8 శాతం మాత్రమే ఆల్కహాల్‌ ఉంటుంది. బీరు తయారీలో కొన్ని రకాల గింజలను ఉపయోగిస్తారు. బీరు ఎక్కువ కాలం పాటు పాడవడానికి ఇదే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. అందుకే బీరుకు గడువు తేదీ ఉంటుంది. అసలు బీర్‌ తాగడమే ఆరోగ్యానికి హానికరమైతే.. గడువు తీరిన బీర్‌ తాగితే మరింత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని ఇంట్రెస్టింగ్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి..