Brake Failure while Driving: కారు బ్రేక్‌లు సడెన్‌గా ఫెయిల్‌ అయితే వెంటనే ఇలా చేయండి

|

Nov 29, 2023 | 10:54 AM

రోడ్లపై నిత్యం ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొందరు నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి తమ ప్రాణాలతోపాటు, ఇతరుల ప్రాణాలను కూడా రిస్క్‌లో పెడుతుంటారు. అయితే ఒక్కోసారి కారు నడుపుతున్నప్పుడు సడన్‌గా బ్రేక్ ఫెయిల్యూర్ అయితే ఘోర ప్రమాదాలు జరుగుతాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సరైన జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలు సురక్షితంగా కాపాడుకోవచ్చు. కారు బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు మీరు చేయవలసిన మొదటి పని ఏమిటి? ప్రమాదాన్ని ఎలా..

Brake Failure while Driving: కారు బ్రేక్‌లు సడెన్‌గా ఫెయిల్‌ అయితే వెంటనే ఇలా చేయండి
Brake Failure While Driving
Follow us on

రోడ్లపై నిత్యం ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొందరు నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి తమ ప్రాణాలతోపాటు, ఇతరుల ప్రాణాలను కూడా రిస్క్‌లో పెడుతుంటారు. అయితే ఒక్కోసారి కారు నడుపుతున్నప్పుడు సడన్‌గా బ్రేక్ ఫెయిల్యూర్ అయితే ఘోర ప్రమాదాలు జరుగుతాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సరైన జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలు సురక్షితంగా కాపాడుకోవచ్చు. కారు బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు మీరు చేయవలసిన మొదటి పని ఏమిటి? ప్రమాదాన్ని ఎలా నివారించవచ్చో ? వంటి విషయాలు మీకోసం..

కారు బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు ఇలా చేయండి..

  • అన్నింటిలో మొదటిది, ముఖ్యమైనది భయాందోళన చెందకూడదు. భయపడకుండా ప్రశాంతంగా ఉండాలి. భయాందోళనలో ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంటుంది. ఇది పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు.
  • బ్రేక్ ఫెయిల్ అయినట్లయితే, మీరు హారన్ మోగించడం ద్వారా సమీపంలోని డ్రైవర్లను అప్రమత్తం చేయవచ్చు. దీంతో వారు మీ కారుకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు.
  • బ్రేక్ ఫెయిల్యూర్ అయిన సందర్భంలో తక్కువ గేర్‌లోకి మార్చడం ద్వారా కారు వేగాన్ని తగ్గించవచ్చు.
    మీకు ఎలాంటి స్పందన రాకపోయినా, బ్రేక్ పెడల్‌పై నొక్కుతూనే ఉండాలి. ఇది బ్రేక్ సిస్టమ్‌లో కొంత ఒత్తిడిని సృష్టిస్తుంది. తద్వారా కారు వేగాన్ని కొంచెం తగ్గించవచ్చు.
  • బ్రేక్‌లు ఫెయిల్ అయినప్పుడు, కారుపై నియంత్రణ కోల్పోవడం సర్వసాధారణం. కాబట్టి హ్యాండిల్‌ను గట్టిగా పట్టు్కోవాలి. కారును నియంత్రించడానికి ప్రయత్నించాలి.
  • మీకు అవకాశం లభించిన వెంటనే, కారును రోడ్డు పక్కన లేదా సురక్షితమైన ప్రదేశంలో ఆపాలి.
  • బ్రేక్ ఫెయిల్యూర్ అయినప్పుడు, ఇంజిన్‌ను ఆఫ్ చేయడం వలన కారు సులభంగా నియంత్రణ కోల్పోతుంది. అందువల్ల, ఇంజిన్ స్విచ్ ఆఫ్ చేయాలి.
  • హ్యాండ్ బ్రేక్ ఉంటే, కారు వేగాన్ని తగ్గించడానికి దాన్ని ఉపయోగించవచ్చు.
  • ముందు వాహనం లేకుంటే, మీరు రోడ్డు పక్కన ఆగి ఉన్న వస్తువును ఢీకొట్టి కారును ఆపవచ్చు. ఇది కారు వేగాన్ని తగ్గించడానికి, ప్రమాదాలను నివారించడానికి సహాయపడుతుంది.

ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

  • బ్రేక్ సిస్టమ్‌ను రెగ్యులర్ చెకప్‌ చేసుకుంటూ ఉండాలి. తద్వారా మెయింటెనెన్స్ బ్రేక్ ఫెయిల్యూర్ అవకాశాలను తగ్గిస్తుంది.
  • బ్రేక్‌లను క్రమం తప్పకుండా పరీక్షించడం ద్వారా, అవి సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవచ్చు.
  • బ్రేక్‌ ఫెయిల్‌ అయిన సమయంలో సురక్షితమైన దూరాన్ని నిర్వహించడం ద్వారా, ప్రమాదాన్ని నివారించడానికి మీకు తగినంత సమయం ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.