ఇప్పుడు తెలంగాణలో కుక్కల దాడుల వార్తలు హాట్ టాపిక్‌గా మారిపోయాయి. కుక్క కనిపిస్తేనే జనం వణికిపోతున్నారు. గ్రామ సింహాలుగా పేరున్న ఈ గ్రామ రక్షక దళం పేరు వినిపిస్తేనే జంకుతున్నారు. తెలుగురాష్ట్రాల్లో వీధికుక్కలు వీరవిహారం చేస్తున్నాయి. మొన్న అంబర్‌పేట్‌లో ఊరకుక్కల దాడిలో ప్రదీప్ చనిపోయిన ఘటన మరువకముందే హైదరాబాద్‌లో మరో ఘటన చోటుచేసుకుంది. నాచారంలోని మల్లాపూర్ గ్రీన్‌హిల్స్‌లో ఇంటిముందు ఆడుకుంటున్న ఆశ్రిత్‌పై కుక్కలు దాడిచేసి కరిచాయి. అప్పటికే భయంతో పరుగులు పెట్టిన ఆశ్రిత్‌ను చూసి గేటులోపల ఉన్న అక్క అరిచింది. ఓవైపు ఆశ్రిత్ పడిపోవడం, అక్క అరవడంతో కుక్కలు వెనక్కి పరిగెత్తాయి. కుక్కలదాడిలో గాయపడిన ఆశ్రిత్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
దీంతో డాగ్ చేజింగ్..? డాగ్ రన్నింగ్..? డాగ్ సరౌండింగ్..? అంటూ కుక్క నుంచి ఎలా తప్పించుకోవాలంటూ.. ప్రశ్నలతో గూగుల్ తల్లిని చుట్టు ముడుతున్నారు. ఒక్కసారిగా నెటిజనం ఇలాంటి ప్రశ్నలు వేస్తుండటంతో సెర్చ్ ఇంజన్ గూగుల్ కూడా కొంత ఇబ్బంది పడుతోందట. అయితే ఒక్కసారిగా ఒకటి రెండు కాదు ఏకంగా 10 కుక్కలు మీ చుట్టూ చేరితే ఏం చేయాలి..? ఎలా రియాక్ట్ కావాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
కుక్కలు మాత్రమే కాదు కోతులు.. ఏదైనా క్రూర జంతువులు మీ ముందు వచ్చినప్పుడు ఎలా ఎదిరించాలనే మనం తెలుసుకుంటే పెద్ద సమస్యలు వచ్చినప్పుడు మనను మనం రక్షించుకోవచ్చు.
మనుషులకే కాదు జంతువులకు కూడా చాలా తెలివితేటలు ఉంటాయి. మనం ఎప్పుడైతే పారిపోతామో అవి కూడా లోలోపల మనకంటే తామే శక్తివంతులం అనుకొని అవి మనల్ని వెంబడిస్తాయి. దాడి చేస్తాయి. కుక్కలు కనిపించిన వెంటనే మనం పరుగులు పెట్టడం సరికాదు. పారిపోవడం, పరుగులు పెట్టడం చేస్తే వెంటబడుతాయి. కుక్కలు కనిపిస్తే అక్కడే నిలిచిపోండి. మీరు ఎప్పటిలా నడవండి. ఏదైనా కుక్క అరుస్తూ మీ దగ్గరకు వస్తే కదలకుండా బొమ్మలా నిలుచోండి. అంతే కొద్ది సేపటి తర్వాత అన్ని అక్కడి నుంచి వెళ్లిపోతాయి.
ఎంతగా కుక్కలు మొరుగుతున్నా మిమ్మల్ని భయపెడుతూ ఉన్నా అక్కడే అలాగే నిలబడాలి , అవి మొరగడం కొద్దిగా నిలిపినా తర్వాత నెమ్మదిగా అక్కడ నుంచి నడక స్టార్ట్ చెయ్యండి.. కుక్కలు ఏమీ చెయ్యవు.
మీరు నడుచుకుంటూ వెళ్తున్న రోడ్డులో కుక్కల గుంపు కనిపించడంతో ఏం చేయాలో చాలా మందికి అర్థం కాదు. వెంటనే వాటిని అలానే చూస్తూ ఉంటారు. వాటి కళ్లలోకి సూటిగా చూడకండి. మన కళ్ళు ఎదుట ఉన్నది కుక్కల గుంపు ఉన్నా సరే మీరు పెద్దగా పట్టించుకోనట్లుగా వ్యవహరించండి. అవి మరోలా అనుకుంటాయి. వాటిని రెచ్చ గొడుతున్నట్లుగా ఫీల్ అవుతాయి. అందుకే.. మన కళ్ళముందు ఉన్న ఎటువంటి ప్రమాదాన్ని అయినా సరే పూర్తిగా దాని మీద మాత్రమే దృష్టి కేంద్రీకరించినప్పుడు అది మనకు చాలా పెద్దదిగా కనిపిస్తుంది. పక్కన ఉన్న వాటితో ఎప్పుడైతే దాన్ని కలిపి చూస్తామో దాని ప్రభావం మన మనసుపై ఉండదు. అందుకే వాటిని పట్టించుకోకుండా ఉండండి.
కుక్క కాని కుక్కల గుంపు కనిపించడంతో మనం పరుగులు పెట్టడం కానీ, వాటిపై రాళ్లు విసరడం చేస్తుంటాం. వాటిని కర్రతో కొట్టేందుకు ప్రయత్నిస్తాం. ఇలా చేయడం వల్ల అవి మరింతగా రెచ్చిపోతాయి. అవి అన్ని వైపుల నుంచి దాడి చేస్తాయి. ఇలాంటి సమయంలో కర్ర చేతిలో పట్టుకోండి. చేతిలో ఎటువంటి ఆయుధం లేకుంటే మనం వేసుకున్న చెప్పులైన, బ్యాగు దేన్నైనా సరే ఆయుధంగా మార్చుకోవాలి అలా నిలబడి ఉండాలి.. పట్టుకొని పెద్దగా రియాక్ట్ కాకుండా ఉంటే మంచిది. వాటిని కొట్టడం చేయవద్దు.
మనం వేసుకున్న రంగులు వాటికి కొన్నిసార్లు నచ్చకపోవచ్చు. ఇందులో మనం ధరించే విచిత్రమైన కలర్ దుస్తువులు, వస్తువులకు కూడా అవి రియాక్ట్ అవుతాయి. ఉదాహరణకు మీరు మంచి కలర్ షర్ట్ వేసుకొని దానిపైన రెడ్ కలర్ టోపీ పెట్టుకుని నల్లటి కళ్లద్దాలు పెట్టుకున్నారనుకోండి.. కుక్కలకు అదేదో వింతగా అనిపించి వెంబడిస్తాయి. కనుక అవి వెంబడించగానే మీరు పెట్టుకున్న క్యాప్ తీసేయడం కళ్లద్దాలు తొలగించడం చేయండి. అవి మనసును మార్చుకుంటాయి.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం