Virgin Birth: శృంగారంలో పాల్గొనలేదు.. అయినా గర్భవతి అయ్యింది.. షాకింగ్ రీజన్ చెప్పిన సైంటిస్టులు..!

|

Jun 02, 2023 | 7:43 AM

ఓ మహిళ సెక్స్ చేయకుండానే గర్భవతి అయింది. ఇది వింతగా ఉన్నా.. నిజంగా  నిజం. అయితే, దీనికి షాకింగ్ రీజన్ చెప్పారు సైంటిస్టులు. వాస్తవానికి ఫోర్ ప్లే ద్వారా కూడా గర్భధారణ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నికోల్ మూర్ గర్భవతి అని తెలుసుకున్నప్పుడు..

Virgin Birth: శృంగారంలో పాల్గొనలేదు.. అయినా గర్భవతి అయ్యింది.. షాకింగ్ రీజన్ చెప్పిన సైంటిస్టులు..!
Virgin Birth
Follow us on

ఓ మహిళ సెక్స్ చేయకుండానే గర్భవతి అయింది. ఇది వింతగా ఉన్నా.. నిజంగా  నిజం. అయితే, దీనికి షాకింగ్ రీజన్ చెప్పారు సైంటిస్టులు. వాస్తవానికి ఫోర్ ప్లే ద్వారా కూడా గర్భధారణ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నికోల్ మూర్ గర్భవతి అని తెలుసుకున్నప్పుడు ఆమె వయస్సు 20 సంవత్సరాలు. కానీ ఆమె ఎప్పుడూ తన బాయ్‌ఫ్రెండ్‌తో పూర్తిస్థాయిలో శృంగారం చేయలేదు. అయినప్పటికీ ఆమె గర్భవతి అయ్యింది. అయితే, వైద్యులు ఆమెను కన్య అని నమ్మలేదు. ఆమె గర్భం దాల్చిన నాలుగు నెలల తర్వాత వైద్యులు ఆమెకు వాజినిస్మస్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. కానీ, ఆమె చెప్పింది విని షాక్ అయ్యారు. తాను శృంగారంలో పాల్గొనకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పడంతో వారంతా అవాక్కయ్యారు.

వాజినిస్మస్ అంటే ఏమిటి?

వాజినిస్మస్ అంటే శృంగార సమయంలో భయంతో యోని కండరాలు ఆటోమేటిక్‌గా బిగుసుకుపోయే పరిస్థితి. 2020 లో, అమెరికాకు చెందిన సమంతా లీన్ కూడా ఇదే విషయాన్ని చెప్పింది. 19 సంవత్సరాల వయస్సులో, తాను కూడా పూర్తిస్థాయిలో శృంగారం చేయకుండానే(పెనెట్రేషన్ జరుగకుండానే) గర్భవతి అయినట్లు టిక్‌టాక్‌ వేదికగా వెల్లడించింది. సెక్స్ లేకుండా గర్భం దాల్చిన మరొక కేసు బయోమెడికల్ జర్నల్‌లో కూడా పేర్కొన్నారు. అయితే, వివాహిత అయిన ఆమె.. ఇద్దరు ఆరోగ్యకరమైన పిల్లలకు జన్మనిచ్చింది.

కన్య గర్భం అంటే ఏమిటి?

దీనిని నాన్‌పెనెట్రేటివ్ ప్రెగ్నెన్సీ, స్పెషల్ ప్రెగ్నెన్సీ లేదా వర్జిన్ బర్త్ అని పిలుస్తారు. బీఎంజే పరిశోధన ప్రకారం.. పెనెట్రేషన్ లేకుండా, ఫోర్ ప్లే ద్వారా మాత్రమే కన్య గర్భం జరుగుతుంది. ప్రీకమ్ (పురుషుల జననేంద్రియాలలో విడుదలయ్యే ద్రవం యోనిలోకి చొచ్చుకుపోవడానికి కందెనగా పని చేస్తుంది) కూడా స్పెర్మ్‌లను తీసుకువెళుతుందని, అది యోని ప్రాంతంతో సంబంధం కలిగి ఉంటే, గర్భం సంభవించవచ్చు అని పరిశోధకులు చెబుతున్నారు. ఈ ద్రవం సెక్స్ టాయ్స్, వేళ్లు, నోటి ద్వారా యోనిలోకి వెళ్లొచ్చు. అలా వర్జిన్ బర్త్‌కు అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

గర్భధారణ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో జరుగుతాయని చెబుతున్నారు పరిశోధకులు. పెళ్లికాని జంటల్లోనే కాకుండా పెళ్లయిన జంటల్లోనూ అవాంఛిత గర్భాల వెనుక కారణం ఇదేనంటున్నారు. అవాంఛిత, ప్రణాళిక లేని గర్భాలను నివారించడానికి, లైంగికంగా సంక్రమించే ఏవైనా వ్యాధుల నుండి దూరంగా ఉండటానికి..  రక్షణను ఉపయోగించడం చాలా ఉత్తమం అని చెబుతున్నారు.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..