Rave Party: ఇటీవల షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. అతడితో పాటు ఇంకొందరు ప్రస్తుతం ముంబై ఎన్‌సీబీ కస్టడీలో ఉన్నారు. వీరందరిని ఓ రేవ్ పార్టీలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి.. ఇక్కడ ఏం జరుగుతుంది. సెలబ్రీటీలు, సినిమా స్టార్స్ ఎందుకు వస్తారు. ఇక్కడ అమ్మాయిలు, అబ్బాయిలు ఎటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తారు.. తెలుసుకుందాం.విదేశాలతో పాటు, ముంబై, పుణె, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ-ఎన్‌సిఆర్ వంటి కాస్మోపాలిటన్ నగరాల్లో ఇటువంటి రేవ్ పార్టీలు నిర్వహిస్తారు. చాలా రేవ్ పార్టీల్లో డ్యాన్స్, ఫన్, ఫుడ్, డ్రింక్, అలాగే డ్రగ్స్, సెక్స్ వంటి వాటికోసం ఏర్పాట్లు చేస్తారు. కానీ డబ్బులు చాలా ఖర్చు చేయాలి. రేవ్ పార్టీ నిర్వాహకులు గోప్యతపై పూర్తి జాగ్రత్త తీసుకుంటారు. అందుకే చాలామంది సెలబ్రీటీలు వీటివైపు ఎక్కువగా మొగ్గుచూపుతారు.
రేవ్ పార్టీ అంటే ఏమిటి..
60వ దశకంలో యూరోపియన్ దేశాలలో పార్టీలంటే కేవలం మద్యానికి మాత్రమే. కానీ 80వ దశకంలో అది మారడం ప్రారంభమైంది. అనంతరం ఇది రేవ్ పార్టీ రూపాన్ని సంతరించుకుంది. 90ల నాటికి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో రేవ్ పార్టీల ధోరణి ప్రారంభమైంది. లండన్‌లో ఇటువంటి ఉద్వేగభరితమైన పార్టీలను ‘రేవ్ పార్టీలు’ అని పిలుస్తారు. యుఎస్ లా డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన డాక్యుమెంట్ ప్రకారం.. రేవ్ పార్టీ 80ల నాటి డ్యాన్స్ పార్టీల నుంచి ఉద్భవించింది. డ్యాన్స్ పార్టీ రేవ్ పార్టీగా మారిపోయింది. మ్యూజిక్ టెక్నాలజీ, హాబీలు, డ్రగ్స్ దీనికి యాడ్ చేశారు. దీంతో వీటకిఇ ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది.
భారతదేశంలో రేవ్ పార్టీలు
ఇండియాలో రేవ్ పార్టీల ధోరణి గోవా నుంచి ప్రారంభమైంది. హిప్పీలు దీనిని గోవాలో ప్రారంభించారు. తరువాత ఇటువంటి పార్టీల ధోరణి అనేక నగరాల్లో పెరుగుతూ వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా హిమాచల్ లోని కులు లోయ, బెంగుళూరు, పూణే, ముంబై వంటి అనేక నగరాలు వీటికి హాట్‌స్పాట్‌లుగా నిలిచాయి. ముంబై, పూణే వంటి నగరాల్లో నిత్యం రేవ్ పార్టీల అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి.
రేవ్ పార్టీల్లో ఏం జరుగుతుంది..
రేవ్ పార్టీ సుదీర్ఘంగా సాగే పార్టీ. ఈ పార్టీలో పాల్గొనాలంటే పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. లోపల పెద్ద శబ్దంతో సంగీతం ప్లే అవుతూ ఉంటుంది. యువత సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఫుడ్, కూల్‌డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్లు కాకుండా, కొకైన్, హషిష్, చరాస్, ఎల్‌ఎస్‌డి, మెఫెడ్రోన్, ఎక్స్టసీ వంటి డ్రగ్స్ కూడా దొరుకుతాయి. కొన్ని రేవ్ పార్టీలలో సెక్స్ కోసం ‘రూమ్స్’ కూడా ఏర్పాటు చేస్తారు. మాదకద్రవ్యాలు తీసుకునేవారికి, విక్రయించేవారికి ఇది సురక్షితమైన ప్రదేశం. అధికారిక ప్రకారం రేవ్ పార్టీలలో పెద్ద మొత్తంలో డ్రగ్స్ తీసుకుంటారు. రేవ్ పార్టీలు 24 గంటల నుంచి మూడు రోజుల వరకు నిర్వహిస్తారు. అయితే ఈ పార్టీలకు ఎంపిక చేసిన కొంతమందికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. గోప్యతపై పూర్తి శ్రద్ధ వహిస్తారు.