Viral News: కాసేపు ఫోన్‌ను చెవి వద్ద పెట్టుకుని మాట్లాడటం పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ, అదే ఓ అర్దగంట, గంట సమయం పాటు అయితే..? మెడలు లాగుతాయి. చేతులు నొప్పి వస్తాయి. ప్రజల సమస్యలను పసిగట్టిన కంపెనీలు.. ఫోన్ మాట్లాడటానికి, పాటలు వినేందుకు సౌకర్యవంతంగా ఉండేందుకు హియర్ ఫోన్స్‌ను తీసుకువచ్చారు. ఆ తరువాత టెక్నాలజీ డెవలప్ అయింది.. హియర్ ఫోన్స్ స్థానంలో ఎయిర్‌పాడ్‌లు అందుబాటులోకి వచ్చాయి. బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవడం, కనెక్టివిటీ మరింత సులభం అవడంతో.. ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉంది. ఎయిర్‌పాడ్‌లతో వైర్స్ సమస్య ఏమీ ఉండదు. ఈ కారణంగానే.. ప్రస్తుతం దాదాపు జనాలందరూ ఎయిర్‌పాడ్స్‌ను వినియోగిస్తున్నారు.
ఈ సంగతి ఇలా ఉంటే.. సాధారణంగా చిన్న పిల్లలు తమ చేతికి ఏ వస్తువు చిక్కితే దానిని తినేందుకు ప్రయత్ని్స్తారు. ఇక చాక్లెట్, పిప్పర్‌మెంట్ వంటి పదార్థాలు చేతికి అందితే.. లటుక్కున నోట్లో వేసేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో పిల్లలు కాయిన్స్, ఇతర వస్తువులను మింగేస్తుంటారు. మరి పెద్దలు అలా ఎప్పుడైనా మింగడం గురించి విన్నారా? వినడం ఎందుకు చూసేయండి. ఓ మహిళ.. డి విటమిన్ ట్యాబ్లెట్ అనుకుని.. ఏకంగా ఆపిల్ ఎయిర్‌పాడ్స్‌ని మింగేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది సదరు మహిళ. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అమెరికాలోని ఉటా నివాసి అయిన టైనా బార్కర్(52), తన స్నేహితుడితో మాట్లాడుతూ.. అనుకోకుండా ఎయిర్‌పాడ్‌ను మింగేసింది. ఈ విషయాన్ని ఆమె టిక్‌టాక్ వేదికగా చెప్పుకొచ్చింది. తన స్నేహితుడితో మాట్లాడాతున్న సందర్భంలో.. పక్కనే ఉన్న ఎయిర్‌పాడ్స్‌ను విటమిన్ డి సప్లిమెంట్ అనుకుని మింగేసింది మహిళ. ఆ తరువాత నీరు తాగేసింది. దాంతో ఎయిర్‌పాడ్ కడుపులోకి వెళ్లిపోయింది.
బార్కర్.. ఇటీవల ఓ ఉదయం వేళ తన స్నేహితురాలితో కలిసి వాకింగ్ కోసం బయలుదేరింది. చాలా రోజుల తరువాత ఆమె కనిపించడంతో.. ఆమె సంతోషంలో తన వద్దకు పరుగెత్తుకెళ్లింది. ఇద్దరూ అలా కబుర్లలో మునిగిపోయారు. చేతిలో ఎయిర్‌పాడ్స్ కేస్, విటమిన్ డి ట్యాబ్లెట్స్ తీసుకెళ్లింది బార్కర్. అయితే, మార్గం మధ్యలో ఇద్దరు మాట్లాడుతున్న సమయంలోనే బార్కర్ విటమిన్ డి ట్యాబ్లెట్‌ను వేసుకుంది. ఆ వెంటనే నీరు తాగింది. అయితే, ట్యాబ్లెట్ వేసుకున్న సమయంలో గొంతులో ఏదో తేడాగా అనిపించింది. అయినప్పటికీ నీరు తాగడంతో లోపలికి వెళ్లిపోయింది. అయితే, బార్కర్ ఫ్రెండ్ వెళ్తున్న సమయంలో.. చేతిలో ఉన్న ఎయిర్‌పాడ్స్ కేసు ఓపెన్ చేద్దామని చూసింది. కానీ, చేతిలో విటమిన్ పిల్ ఉంది. ఎయిర్‌పాడ్ కేస్ ఓపెన్ చేస్తే.. అందులో ఓ ఎయిర్‌పాడ్ లేదు. అప్పుడు అర్థమైంది బార్కర్‌కు తాను వేసుకుంది విటమిన్ ట్యాబ్లెట్ కాదు.. ఎయిర్‌పాడ్‌ను మింగేసినట్లు గ్రహించింది.
ఈ విషయాలన్నీ టిక్ టాక్ వేదికగా వెల్లడించిన బార్కర్.. వైద్యులను సంప్రదించనున్నట్లు తెలిపింది. కాగా, బార్కర్ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరీ ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా తల్లీ అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..