Valentine’s Week 2021: ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు.. ఇప్పటికే ప్రేమికుల సందడి మొదలైంది. కొందరు ప్రేమికుల దినోత్సవం మన సంస్కృతి కాదు అంటూ తిడతారు.. కానీ రెండు మనసులు కలిసిన వ్యక్తులు ఎంతో ఇష్టంగా ఆ రోజు కోసం ఎదురు చూస్తారు. జాలీగా డెస్టినేషన్ డే అంటూ జరుపుకుంటారు.
అయితే ఈరోజు నుంచి ప్రేమికుల వారం మొదలైంది. ప్రేమికులు ఒక్కో రోజును ఒక్కోలా సెలబ్రేట్ చేసుకుంటారు., ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 7 నుండి 14 వరకు కాలాన్ని ప్రేమికుల వారంగా జరుపుకుంటారు. తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఇదే సరైన సమయం అని భావిస్తారు. అయితే మిగిలిన సమయాల్లో ఒకరికొకరు ఎన్ని బహుమతులిచ్చుకున్నా ఈ ప్రేమికుల వారోత్సవాల్లో ఇచ్చిన బహుమతులు వెరీవెరీ స్పెషల్ గా నిలిచిపోతాయి. మరి ప్రేమికుల దినోత్సవం రోజున సహజంగా ఇచ్చే బహుమతులు ఏమిటో చూద్దాం..!
గులాబీ తో మీ మనసులోని మాటను సులువుగా అవతలి వారికి తెలియచేయవచ్చు. ముఖ్యంగా ఎరుపు రంగు గులాబీలను అవతలి వ్యక్తిపై తన ప్రేమని వ్యక్తం చేయడానికి ఉపయోగిస్తారు.
వాలెంటైన్స్ డేకి గ్రీటింగ్ కార్డుకు మించిన మంచి గిఫ్ట్ లేదు. గ్రీటింగ్ కార్డు లోని సందేశం ద్వారా సులువుగా మీ ఫీలింగ్స్ ను అవతలి వ్యక్తిని తెలియజేయవచ్చు
చాకోలెట్స్ ద్వారా కూడా మీ ప్రేమని వ్యక్తం చేయవచ్చు. సాధారణంగా డైరీమిల్క్ ఈ సందర్భంలో ఇస్తారు.
కేక్ అనేది తమని ప్రేమని ఇష్టపడిన వాళ్లకు చెప్పిన తర్వాత… ఆ ఆనందాన్ని పంచుకోవడానికి కానుకగా ఇస్తారు.
ప్రేమించిన వారిని బాగా ఆకర్షించి, వారి ప్రేమని గెలుచుకోవాలంటే, ప్రేమించిన వారు సొంతగా వారి చేతులతో ఎదుటివారి అభిరుచులకు తెగ్గట్టుగా తయారుచేస్తే ఇంకా బాగుంటుంది మరియు అది కలకాలం గుర్తుగా ఉంటుంది. షాపులలో ఎక్కువ ఖరీదు పెట్టి కొనే వస్తువులకన్నా, ఇటువంటి చిన్న చిన్న బహుమతులతో వచ్చే బంధమే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది మరియు కలకాలం నిలుస్తుంది.
వీటితో పాటు గాడ్జెట్స్, డ్రెస్ల వంటి వాటితో కూడా ప్రేమను వ్యక్తం చేయవచ్చు. అయితే ఆ గిఫ్ట్ వెరీ వెరీ స్పెషల్ అనే ఫీలింగ్ వచ్చేలా ఉండాలి. ఇచ్చేది ఎలాంటి గిఫ్ట్ అయినా.. అది మీ మధ్య ప్రేమను గుర్తుచేసేదిలా ఉండాలి. నచ్చిన రంగు డ్రెస్, ఇష్టమైన గాడ్జెట్, అందమైన హ్యాండ్ బ్యాగ్.. ఇలా పార్ట్నర్ని సంతోషపెట్టే ఏ గిఫ్ట్స్ అయినా ఇవ్వొచ్చు. మరి ఈ ప్రేమికుల రోజు మీ మనసుకి నచ్చిన వారికి ఇటువంటి చిన్న మరియు విలువైన బహుమతులతో మీ బంధాన్ని దృఢపరచుకోండి.
Also Read: