School Train: విద్యా బోధనకు కొత్త శ్రీకారం.. ప్రకృతి అందాలను పాఠాలుగా మార్చి రైలు బడి..!

| Edited By: Balaraju Goud

Jul 02, 2024 | 6:29 PM

స్కూల్‌కు వచ్చే పిల్లలు చుక్ బుక్ బండి అంటూ రైలు ఆట ఆడుకుంటుంటారు. అటువంటిది రైలు స్కూల్ కే వచ్చేస్తే ఎలా ఉంటుంది. ఇదిగో ఇలాఉంటుంది. అదొక రైలు బడి. పిల్లలు పాఠశాలకు పెద్ద ఎత్తున వచ్చేలా ఆకర్షించేందుకు కొత్త విధానంలో బోధనకు శ్రీకారం చుట్టారు ఉపాధ్యాయులు.

School Train: విద్యా బోధనకు కొత్త శ్రీకారం.. ప్రకృతి అందాలను పాఠాలుగా మార్చి రైలు బడి..!
Train School
Follow us on

స్కూల్‌కు వచ్చే పిల్లలు చుక్ బుక్ బండి అంటూ రైలు ఆట ఆడుకుంటుంటారు. అటువంటిది రైలు స్కూల్ కే వచ్చేస్తే ఎలా ఉంటుంది. ఇదిగో ఇలాఉంటుంది. అదొక రైలు బడి. పిల్లలు పాఠశాలకు పెద్ద ఎత్తున వచ్చేలా ఆకర్షించేందుకు కొత్త విధానంలో బోధనకు శ్రీకారం చుట్టారు ఉపాధ్యాయులు. తరగతి గదులను రైలు బోగిలుగా మార్చి ప్రకృతి అందాలను పాఠాలుగా మార్చి చిన్నారులకు వైవిధ్యంగా విద్యను అందిస్తోంది ఓ ప్రభుత్వ పాఠశాల. దీంతో బడి పేరెత్తితేనే గందరగోళం సృష్టించే పిల్లలు.. ఇప్పుడు బడికి వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

పిల్లలందరిని స్కూలుకు పరుగులు పెట్టేలా చేస్తోన్న ఈ ప్రభుత్వ పాఠశాల సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని మునిదేవునిపల్లి గ్రామంలో ఉంది. ఇక్కడ రైలు మాదిరిగా కనిపిస్తున్న ఈ భవనమే ప్రభుత్వ పాఠాశాల. ఇక్కడ విద్యార్థులకు ఎప్పటికప్పుడు నూతన విధానంలో, ఆహ్లాదకర విధానంలో బోధన అందిస్తారు. ఈ పాఠశాలలో ఒకటోవ తరగతి నుండి 7వ తరగతి వరకు విద్యార్థులకు బోధన అందిస్తున్నారు. ఈ పాఠశాలలో మొత్తం 67 మంది విద్యార్థులు ఉండగా, 5 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు.

కేరళలో ఈ రైలు బడి లాంటి పాఠశాలను చూసిన ఉపాధ్యాయులు, దానిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులకు నూతన ఉత్సాహాన్ని నింపడానికి వినూత్న ఆలోచన చేశారు. ఉన్న పురాతన స్కూల్ భవనాన్ని మరమత్తులు చేపించారు ఉపాధ్యాయులు. దీనికి గ్రామ ప్రజలు, సర్పంచ్, ఎంపీటీసీల ప్రోత్సాహంతో స్కూల్ బిల్డింగ్‌ను రైలు బడిలా మార్చేశారు. గతంలో లేని విధంగా ఈ భవనాన్ని చూసి విద్యార్థుల ప్రవేశాల సంఖ్య కూడా పెరిగింది. అన్ని పాఠశాలలో కన్న కూడా ఈ పాటశాల విభిన్నంగా ఉందని, ఇక్కడ సిబ్బంది కూడా పిల్లలని బాగా చూసుకుంటున్నారనీ, తమకు ఈ పాఠశాల బాగా నచ్చిందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా వినూత్నమైన ఆలోచనతో పిల్లలకు విద్యను అందిస్తున్నారు ఇక్కడి ఉపాధ్యాయులు..ఈ రైలు బడిని చూడడానికి ఎంతో మంది వస్తుంటారు అని తెలిపారు. ఉపాధ్యాయులు తీసుకున్న నిర్ణయం పిల్లల తల్లిదండ్రులు కూడా మెచ్చుకునేలా చేసింది. ఏది ఏమైన ఒక ప్రభుత్వ పాఠశాలను ఇలా మార్చి విద్యార్థులకు విద్యను అందించడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని హ్యమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..