ఈ కుటుంబం ఎంతో సంతోషంగా గడిపింది. పెద్దగా అస్తులు లేకున్నా కష్టాన్ని నమ్ముకున్నాడు ఆ ఇంటి పెద్ద. భార్యతోపాటుగా ఇద్దరు అడ పిల్లలు, ఒక కొడుకును అప్యాయంగా చూసుకున్నాడు. అమ్మాయిల భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఓ మాయలేడి మాటలలతో మూడు ముళ్ళ బంధం, పేగు బంధం దూరం అయ్యింది. అ మాయ నుంచి బయట పడలేక ఇబ్బంది పడుతున్నారు బార్య ఇద్దరూ అడపిల్లలు.
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన మల్లేశం, భాగ్య దంపతులు. వీరికి పదిహేను ఏళ్ల క్రితమే పెళ్ళి జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలతోపాటు, ఒక కొడుకు ఉన్నారు. రోజు కష్ట పడుతూ ముగ్గురూ పిల్లలను, భార్యను పోషిస్తున్నారు. ఈ కుటుంబం లో ఎలాంటి విభేదాలు లేవు. అయన కష్టపడినా, బాగ్యను మాత్రం కూలి పనులకు పంపలేదు. ఎంతో సంతోషంగా సాగుతున్న కుటుంబం లో ఓ సంఘటన తండ్రి ప్రేమకు కూతుళ్ళను దూరం చేసింది.
ప్రకాశం జిల్లా లింగ సముద్రం మండలం ముత్యాలపాడు చెందిన కృష్ణవేణి అనే మహిళ బాతుల పెంపకం కోసం సూరారం గ్రామానికి వచ్చింది. చెరువు ప్రక్కనే బాగ్య ఇళ్ళు ఉండడంతో కృష్ణవేణి అప్పుడప్పుడు ఫోన్ వార్జింగ్ కోసం వచ్చేది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇక్కడి నుండి వెళ్ళిన తరువాత తరుచుగా ఫోన్ లో మాట్లాడుకునేవారు. గంటల తరబడి ఫోన్ లో మాట్లాడంతో భర్త ఒకసారి నిలదీశాడు. ఇద్దరూ ఫోన్‌లో అసభ్యంగా మాట్లాడుకునే వారని మల్లేశం అరోపించారు.
ఎప్పుడైతే కృష్ణవేణి ఫోన్ లో తరుచుగా మాట్లాడంతో భర్తని ప్రక్కన బెట్టింది భాగ్య. భర్త అవసరం లేదంటూ గొడవకి దిగింది. ఈ క్రమంలోనే తొమ్మిది నెలల క్రితం ఇద్దరు అమ్మాయిలను వెంట పెట్టుకుని ముత్యాలపాడు గ్రామానికి వెళ్ళింది. అయితే ఎటు వెళ్ళిందో అర్థం కాక ధర్మపురి పోలిసులని అశ్రయించాడు మల్లేషం. ఎడు నెలల పాటు ఆచూకీ లభించలేదు. రెండు నెలల క్రితం ముత్యాలపాడు గ్రామంలోఉన్నట్లు తెలిసింది. దీంతో భార్యా పిల్లలను తీసుకు వచ్చేందుకు వెళ్లిన మల్లేష్‌పై కృష్ణవేణి తోపాటు ఆమె బంధువులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే లింగసముద్రం పోలీసులను ఆశ్రయించాడు మల్లేష్. భార్యతోపాటు తన ఇద్దరు అడ పిల్లలలను పంపించాలంటూ పోలీసులను వేడుకున్నాడు.
ఇదిలావుంటే, పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాగ్య తనకి భర్త లేడంటూ.. శివుడే తన భర్త అంటూ కొత్త వాదన మొదలు పెట్టింది. ఇద్దరు అమ్మాయిలు తండ్రితో రావడానికి సిద్దంగా ఉన్న భార్య భాగ్య మాత్రం ససేమిరా అంటూ ఆమెతోపాటు మాయ లేడీ అడ్డుకుంటున్నారు. మరోసారి స్థానిక పోలీసులను వేడుకున్న కనికరించలేదని మల్లేష్ తెలిపాడు. భార్య ఇద్దరు పిల్లల అడ్రసు తెలిసినా తన దగ్గరికి తీసుకు వచ్చే అవకాశం లేకుండా పోయిందంటూ అవేదన వ్యక్తం చేస్తున్నాడు. అ ఇద్దరు మహిళల కారణంగానే తన భార్యా, పిల్లలు దూరం అయ్యారంటూ రోదిస్తున్నాడు మల్లేష్.
భార్య, ఇద్దరు పిల్లల అచూకీ తెలిసిన ఇంటికి పంపించక పోవడం స్థానిక పోలీసుల వ్యవహార శైలి కూడా కారణం అనే ఆరోపణలు వినబడుతున్నాయి.ఇటివల ఒక అమ్మాయి మిస్సింగ్ కేసులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. దీనితో తొమ్మిది రోజులలోనే అమ్మాయి అచూకీ లభించింది. తాజా ఘటనలో అచూకీ లభించిన స్వగ్రామానికి పంపించడంలో అధికారుల అలసత్వంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని అ ముగ్గురిని క్షేమంగా అప్పజెప్పాలని మల్లేష్ వేడుకుంటున్నాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఇద్దరూ కూతుళ్ళకు ఏమైనా జరుగితే ఎవరూ బాధ్యత వహించాలని అంటున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..